రాజా సాబ్ ట్రైలర్.. మారుతి మాయాజాలం..!
మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమాల ట్రైలర్స్ విడుదలకు 10 రోజుల ముందు.. మహా అయితే 15 రోజుల ముందు విడుదల చేస్తారు. కానీ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్ నటిస్తున్న రాజా సాబ్ ట్రైలర్ మాత్రం 3 నెలల ముందే విడుదల చేసారు. దాని వెనక కారణమేంటి..? 90 రోజుల ముందే మూడున్నల నిమిషాల ట్రైలర్ ఎందుకు విడుదల చేసినట్లు..? ఏంటి సీక్రేట్..? ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియన్ హార్రర్ ఫాంటసీ రాజా సాబ్ ట్రైలర్ విడుదలైంది.
మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమాల ట్రైలర్స్ విడుదలకు 10 రోజుల ముందు.. మహా అయితే 15 రోజుల ముందు విడుదల చేస్తారు. కానీ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్ నటిస్తున్న రాజా సాబ్ ట్రైలర్ మాత్రం 3 నెలల ముందే విడుదల చేసారు. దాని వెనక కారణమేంటి..? 90 రోజుల ముందే మూడున్నల నిమిషాల ట్రైలర్ ఎందుకు విడుదల చేసినట్లు..? ఏంటి సీక్రేట్..? ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియన్ హార్రర్ ఫాంటసీ రాజా సాబ్ ట్రైలర్ విడుదలైంది. చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మూడున్నర నిమిషాలతో వచ్చిన ఈ ట్రైలర్ అంతా అభిమానులను దృష్టిలో పెట్టుకుని కట్ చేసారు మారుతి. విజువల్స్ అదిరిపోయాయి. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా రాజా సాబ్ విడుదల కానుంది. మిరాయ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇందులోనూ VFX అదిరిపోయింది.. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో వచ్చిన విజువల్స్ పీక్స్‌లో ఉన్నాయి. కచ్చితంగా ఈ ట్రైలర్‌తో రాజా సాబ్‌పై అంచనాలు డబుల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీ బిజినెస్ కోసమే 3 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేసారని తెలుస్తుంది. హిందీ నుంచే 300 కోట్ల బిజినెస్ చేయాలని చూస్తున్నారు రాజా సాబ్ మేకర్స్. ట్రైలర్ బాగుండటంతో వాళ్ల ప్లాన్ వర్కవుట్ అయ్యేలా ఉంది. మరో ట్రైలర్‌ను జనవరిలో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రానుంది. మొత్తానికి రాజా సాబ్ టైమ్ స్టార్ట్ అయిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్.. అప్పటి వరకు రెస్ట్..!
Balakrishna: మరో క్రేజీ కాంబో సెట్ చేస్తున్న బాలయ్య
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

