సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్త కోటి ఇలవేల్పు సింహాచలం అప్పన్న. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కోరిన కోర్కెలు తీర్చే బంగారు తండ్రిగా కొలువయ్యారు. విశాఖపట్ణణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో ఉన్న పర్వత శ్రేణిపై సింహాచలం అప్పన్నగా పూజలందుకుంటున్నారు.
విజయ దశమిలో భాగంగా సోమవారం ఆయుధ పూజ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గధం, శరం, విల్లంబు, సుదర్శ చక్రంతో పాటు అన్ని ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ పర్యవేక్షణలో పురోహితులు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమం జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఫలాలను నివేదన చేశారు. మూడు రోజుల పాటు ఉభయ సంధ్యలలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి ఆయుధాలను స్వయంగా చూసిన భక్తులు తరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

