AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు

రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 4:24 PM

Share

వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ మానవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేధ దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. దీంతో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఇది మరింత తీవ్రతరం కానుందని నివేదికలు చెబుతున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల స్వరూపం కూడా సమూలంగా మారిపోతోంది.

కొన్ని రకాల పనులకు మనుషుల అవసరం తగ్గుతుండగా, మరికొన్ని కొత్త రంగాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న పదేళ్లలో ఉద్యోగ మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరిస్తూ అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉండగా, మరికొన్ని రంగాల్లో లక్షలాది కొత్త కొలువులు పుట్టుకొస్తాయని స్పష్టమవుతోంది. నివేదిక ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రభావంతో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, సేల్స్, తయారీ వంటి రంగాల్లో ఉద్యోగాలు భారీగా తగ్గిపోనున్నాయి. ముఖ్యంగా, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు పెరగడంతో రానున్న పదేళ్లలో ఏకంగా 3,13,600 క్యాషియర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఆఫీస్ క్లర్కులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల ఉద్యోగాలకు కూడా పెద్ద ముప్పే పొంచి ఉంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల వాడకం పెరగడంతో కస్టమర్ సర్వీస్ రంగం కుదించుకుపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్డ్ ప్రాసెసర్లు, టెలిఫోన్ ఆపరేటర్ల వంటి ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే దశలో ఉన్నాయని నివేదిక తెలిపింది. మరోవైపు హెల్త్ కేర్, రవాణా రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయి. టెక్నాలజీ కన్నా జనాభాలో వస్తున్న మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వృద్ధుల జనాభా పెరగడం, దీర్ఘకాలిక వ్యాధుల సంఖ్య ఎక్కువ కావడం వంటి కారణాలతో ఆరోగ్య సంరక్షణ, సామాజిక సహాయ రంగాల్లో రానున్న దశాబ్దంలో 17 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని బీఎల్ఎస్ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా హోమ్ హెల్త్, పర్సనల్ కేర్ ఎయిడ్స్ కొలువులు ఉండనున్నాయి. రిజిస్టర్డ్ నర్సులు, మెడికల్ మేనేజర్ల ఉద్యోగాలకు కూడా మంచి డిమాండ్ ఉండనుంది. వీటితో పాటు ఈ-కామర్స్ విపరీతంగా పెరగడంతో రవాణా, వేర్‌హౌసింగ్ రంగాల్లో కూడా ఉద్యోగాల వృద్ధి బలంగా ఉండనుంది. రానున్న పదేళ్లలో ఈ రంగంలో దాదాపు 5,80,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా వేర్‌హౌస్ వర్కర్లు, ట్రక్ డ్రైవర్లకు గిరాకీ అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్‌ ఐడియా

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక

Gold Price: బాబోయ్‌ బంగారం ధర మోత మోగిపోతోంది..