AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 4:06 PM

Share

పసి పిల్లలను చూస్తే ఎంతటివారికైనా ప్రేమ కలుగుతుంది. అది తమ బిడ్డ కాకపోయినా దగ్గరకు తీసుకుంటారు..ముద్దుచేస్తారు. ఇది మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ కోతి కుక్కపిల్లను ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. తన పిల్లను ఎత్తుకెళ్లి చిటారుకొమ్మన కూర్చుంది కోతి.

దాంతో అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. నాకిచ్చెయ్‌.. అన్నట్టుగా తల్లి కుక్క చూస్తూ ఉండిపోయింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లిలో జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఓ కోతి ఎత్తుకెళ్ళింది. ఆ కుక్క పిల్లను హత్తుకొని ఊరంతా తిరిగింది. ఆ కుక్కపిల్ల కోసం తల్లి కుక్క అరుపులు విని వీధి కుక్కలన్నీ ఒక్కటయ్యాయి. ఈ విచిత్ర సంఘటన రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఓ చోట వీధి కుక్క కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. ఎక్కడినుంచి గమనించిందో కానీ.. ఓ కోతి అక్కడకు వచ్చింది. ఆ సమయంలో కుక్క అక్కడ లేకపోవటంతో వాటిని అలా చూస్తూ ఉంది కోతి. ఆ చిన్ని కుక్కపిల్లలను చూడగానే ఏమనిపించిందో ఏమో.. అక్కడున్న బుల్లి కుక్కపిల్లను చంకనవేసుకుని తెగముద్దాడింది. తర్వాత చటుక్కున చెట్టెక్కేసింది. ఇంతలో తల్లికుక్క అక్కడికి వచ్చింది. తన పిల్లను కోతిదగ్గర చూసి బావురుమంది. తన పిల్లను ఇచ్చేయమన్నట్టుగా తల్లికుక్క వానరం వెంటపడినా ఇవ్వలేదు. ఈ క్రమంలో తల్లి కుక్కకు మరికొన్ని వీధి కుక్కలు తోడయ్యాయి. అయినా వదల్లేదు. ఆ కోతి చేతి నుంచి అక్కడ ఉన్న స్థానికులు కుక్క పిల్లను విడిపించడం కోసం ఎంత ప్రయత్నం చేసినా కోతి వదిలేదేలే అన్నట్టుగా మొరాయించింది. పాపం తల్లికుక్క తన పిల్లకోసం తల్లడిల్లిన తీరు స్థానికులను కదిలించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక

Gold Price: బాబోయ్‌ బంగారం ధర మోత మోగిపోతోంది..

రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!

గుడ్డిగా కెరీర్‌ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్‌ దుస్థితి ఇదీ