AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 3:35 PM

Share

వర్షాకాలం కావడంతో పాములు కొండలు, కోనలు వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పర్వతప్రాంతాలకు సమీపంలో ఉండటం వలన పాములు పుణ్యక్షేత్రాల్లోకి చొరబడుతున్నాయి. తిరుమలలో నడక మార్గంలో, దుకాణాల్లో పాములు, కొండచిలువలు తిష్టవేసి భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో పాములు హల్‌చల్‌ చేస్తున్నాయి.

సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తుల క్యూ లైన్‌వద్ద నాగుపాము కనిపించి భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పుడు మహానందిలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో కొండచిలువ హల్చల్‌ చేసింది. సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిని పాములు వీడటం లేదు. సోమవారం భక్తుల క్యూ లైన్ లలో నాగుపాము హల్చల్ చేయగా మంగళవారం మహానంది పోలీస్ క్వార్టర్స్ లో కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో మహానందివాసులు పాముల బెడదతో ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్ క్వాటర్స్ లో కొండచిలువను గమనించిన పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు.రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ మోహన్ ఎంతో చాకచక్యంగా ఐదు అడుగుల కొండచిలువను పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టారు. కొండచిలువ పట్టుబడటంతో పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక

Gold Price: బాబోయ్‌ బంగారం ధర మోత మోగిపోతోంది..

రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!

గుడ్డిగా కెరీర్‌ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్‌ దుస్థితి ఇదీ

గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత

Published on: Oct 01, 2025 03:33 PM