గుడ్డిగా కెరీర్ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్ దుస్థితి ఇదీ
భారత్‌లో కెరీర్ కౌన్సెలింగ్ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం తేల్చింది. కేవలం 10 శాతం విద్యార్థులకు మాత్రమే కెరీర్‌కు సంబంధించిన సలహాలు లభిస్తున్నాయి లేదా దాని గురించి వారికి అవగాహన ఉంది. మిగతా 90 శాతం మంది కుటుంబ సభ్యుల సలహాలు, అంకుల్ ఉద్యోగాలు, సామాజిక ఒత్తిడుల ఆకర్షణలో పడి సరైన కెరీర్ ఎంపిక చేసుకోవడం లేదు.
ఏడు రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతులు చదువుతున్న 21 వేల మంది విద్యార్థులను సర్వే చేసి యూఎన్ ఈ అధ్యయనాన్ని వెలువరించింది. కేవలం 14 శాతం భారతీయ ఉద్యోగులు మాత్రమే తాము కెరీర్‌లో అభివృద్ధి చెందుతున్నట్టు భావిస్తున్నారట. వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా కెరీర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఈ అంతరం ఏర్పడిందని.. దీని వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందని స్టడీలో తెలిసింది. 10 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ కోర్సుల ఫీజు, ఎంపికలు, విద్యా సంస్థలు, అవకాశాల గురించి తెలుసు. ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ కౌన్సెలింగ్ లభించడం లేదు. భారత్‌లో చాలా స్కూళ్లల్లో అసలు కెరీర్ కౌన్సిలర్లు లేరు. తల్లిదండ్రులు ఇంకా ఇంజినీరింగ్, మెడిసిన్, సివిల్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. కెరీర్ కౌన్సెలింగ్ అంతరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే స్థానిక భాషల్లోని మొబైల్ యాప్స్ ద్వారా కొంత మేరకు భర్తీ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

