గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత
బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్‌ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్ వాలిపోయింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి నగర పాలిక నుంచి అనుమతి తీసుకుంది.
కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు. అంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపుకు వాలింది. ఎప్పుడైనా కూలుతుందని స్థానికులు భయపడ్డారు. దక్షిణ నగర పాలిక అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఆ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pakistan: ట్రంప్ ను బుట్టలో వేసుకుంటున్న పాక్
గిన్నిస్ బుక్ లో తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి
క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

