గిన్నిస్ బుక్ లో తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి
తెలంగాణ ఆడబిడ్డల సాధికారతకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు రికార్డులు సొంతమయ్యాయి. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలో ఈ ఘనత నమోదైంది.
మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల భారీ మెగా బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డును సాధించగా, దాని చుట్టూ 10,000 మంది మహిళలు లయబద్ధంగా బతుకమాడి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మ చుట్టూ ఉయ్యాలా పాటలకు నృత్యాలు చేస్తూ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అద్భుతమైన వేడుకను గిన్నిస్ బుక్ ప్రతినిధులు నమోదు చేసి ఫలితాలను ప్రకటించారు. ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగకు లభించిన ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయంగా చాటింది. ఈ వేడుకలో మంత్రులు సీతక్క, జూపలి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్
Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం
దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

