Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
మిస్ వరల్డ్ 2025 ముద్దు గుమ్మ ఓపన్ సుచాత మరియు కాంటినెంట్ విజేతలు హైదరాబాద్ లో మరోసారి సందడి చేశారు. గ్లోబల్ బ్యూటీ విత్ ఎ పర్పస్ చొరవలో భాగంగా అంధులైన మరియు హెచ్ఐవి సోకిన 200 మంది అనాధ పిల్లలకు చేసే చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. "హోప్ ఇన్ యాక్షన్" అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఫార్చ్యూన్ రామా ఫౌండేషన్ తరపున డాక్టర్ సిహెచ్.రామకృష్ణ నిర్వహించారు.
200 మంది అంధులైన మరియు హెచ్ఐవి సోకిన అనాధ పిల్లలకు పుస్తకాలు, పోషకమైన ఆహారం, దుస్తులు, స్కూల్ కిట్‌లు, బ్రష్ సోప్ వంటి కాస్మెటిక్ కిట్, డిజిటల్ వాచీలు, ట్రాలీ బ్యాగులు, బొమ్మలు, ప్రోటీన్ పౌడర్ మరెన్నో ఉపయోగకరమై వస్తువులను ఒక సంవత్సరం స్పాన్సర్‌షిప్ కార్యక్రమం లో భాగంగా అందించారు. థాయిలాండ్‌కు చెందిన మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత కిరీటం ధరించి ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారు. వీరితో పాటు కాంటినెంట్ విజేతలు – ఇథియోపియా నుండి మిస్ వరల్డ్ ఆఫ్రికా హాసెట్ డెరెజే అడ్మాసు, బ్రెజిల్ నుండి మిస్ వరల్డ్ అమెరికాస్ జెస్సికా పెడ్రోసో, ఫిలిప్పీన్స్ నుండి మిస్ వరల్డ్ ఆసియా కృష్ణ మేరీ గ్రావిడెజ్, పోలాండ్ నుండి మిస్ వరల్డ్ యూరప్ మజా క్లాజ్డా, మార్టినిక్ నుండి మిస్ వరల్డ్ కరేబియన్ ఆరేలీ జోచిమ్ మరియు ఆస్ట్రేలియా నుండి మిస్ వరల్డ్ ఓషియానియా జాస్మిన్ స్ట్రింగర్ ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి సొంత ఇంటికి వచ్చిన ఆనందం కలుగుతుందని హైదరాబాద్ వేదిక నుంచే తాను ప్రపంచానికి మిస్ వరల్డ్ గా పరిచయమైనందుకు చాలా ఆనందంగా ఉందని ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మనుషుల ఆప్యాయత ఎంతో నచ్చిందని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రసాద్ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

