నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా
నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన తాను.. ఇక బస్సు దిగి కొత్త పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా.. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.
ఈ నేపథ్యంలో సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా చివరిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ సజ్జనార్.. “ప్రయాణాలు ఆగిపోవచ్చు, కానీ ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారు. ఇప్పుడు నా బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చింది. టీజీఎస్ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లు జీవనాడి. అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి, ప్రయాణికుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆర్టీసీలో తన అనుభవాలను మరింత వివరంగా ప్రజలతో పంచుకుంటానని సజ్జనార్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని చాటుకుంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 బస్సులో ప్రయాణించారు. యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అండమాన్‌లో.. భారీ గ్యాస్ నిక్షేపాలు
మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..
ఇక.. మొబైల్ తరహాలో గ్యాస్ పోర్టబులిటీ
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు
బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

