ఇక.. మొబైల్ తరహాలో గ్యాస్ పోర్టబులిటీ
మీరు మీ ఎల్‌పీజీ గ్యాస్ సప్లయ్ చేసే ఏజెన్సీ వారితో ఇబ్బందులు పడుతున్నారా? వారి సేవల పట్ల మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు గ్యాస్ పోర్టబులిటీ ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. మొబైల్ విషయంలో మాదిరిగా ఇకపై మీరు మీకు నచ్చిన గ్యాస్ కంపెనీకి మీ గ్యాస్ కనెక్షన్‌ను మార్చుకోవచ్చు.
ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు స్వీకరించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు నోటీసు రిలీజ్ చేసింది. స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సమర్థవంతంగా సేవలు అందించలేకపోయినా, ఇతర నిర్వహణ పరమైన సమస్యల వల్ల సదరు గ్యాస్ కంపెనీ వినియోగదారులకు నాణ్యమైన గ్యాస్ సరఫరా చేయలేకపోయినా.. ఇక ఈ పోర్టబులిటీ ఆప్షన్‌ను వాడుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ కంపెనీల, ఏజెన్సీల పనితీరు మరింత పెరుగుతుందని, కస్టమర్లకు తద్వారా మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సిలిండర్ ధర ఒకేలా ఉన్నప్పుడు వినియోగదారులు తమకు నచ్చిన ఎల్‌పీజీ డీలర్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఎల్‌పీజీ పోర్టబులిటి కోసం మార్గదర్శకాలను రూపొందిచనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2013 అక్టోబరులోనే పైలట్ ప్రాజెక్టు కింద 24 జిల్లాలో పోర్టబులిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత 2014లో 13 రాష్ట్రాల్లోని 480 జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించింది. ఆ పైలట్ ప్రాజెక్టులో కూడా గ్యాస్ ఏజెన్సీలను మార్చుకోగలరు కానీ, కంపెనీలను మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ, ఇకపై ఏజెన్సీలతో పాటు కంపెనీలను కూడా మార్చుకునేలా ఇంటర్ పోర్టబులిటీ సేవలను అందుబాటులోకి తేవాలని పీఎన్‌జీఆర్‌బీ నిర్ణయించింది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలు, వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణను మొదలుపెట్టింది. ఆ తర్వాత నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించి దేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ పోర్టబులిటీ సేవల అమలుకు ఒక తేదీని నిర్ణయిస్తామని వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు
బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
వెనక్కి వెళ్లిన అంతర్వేది సముద్రం.. భయాందోళనలో స్థానికులు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

