మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణీ కుముదిని సోమవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు ఆమె తెలిపారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ జరగనుంది. మరుసటిరోజే అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: అభిషేక్ శర్మకు గిఫ్ట్ గా రూ.33 లక్షల కారు
నీ డబ్బేం వద్దు విజయ్.. నా సోదరిని నాకివ్వు
నవరాత్రుల శుభవేళ ఆలయంలో అద్భుతం
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

