ఛీ !! విజయ్ తీరుపై కట్టప్ప షాకింగ్ రియాక్షన్
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్స్ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. విజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
“ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి. అది చిన్న తప్పు అయితే, దాన్ని సరిచేసుకోవాలి. అది పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!” అంటూ సత్యరాజ్ పోస్ట్ చేశారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన సభల్లో 8మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద బైకర్స్ పడిపోయి కొందరు తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరచుగా విజయ్ సభల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేయడం తమిళనాడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కోర్టుకు కూడా తెలిపారు. ఇప్పుడు సినీ నటుడు సత్యరాజ్ కూడా దానిని పరోక్షంగా చెప్పారు. తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విజయ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్ పరోక్షంగా చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ చెప్పాల్సింది చెప్పేశా. ఇంకేమీ లేదు’
నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా
అసలు మొలకలు ఏ టైంలో తినాలో తెల్సా?
పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్ కూడా తక్కువే
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

