AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా

Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా

Phani CH
|

Updated on: Sep 30, 2025 | 4:20 PM

Share

షణ్ముఖ్ జశ్వంత్.. ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేడు కానీ.. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈయన చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే.. యూ ట్యూబ్‌ వీడియోస్‌తోనే హీరో రేంజ్‏లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్‌తో యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కొన్ని మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోయాయి.

తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న షన్నూ.. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యాడు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలలో నిలిచాడు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్.. ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరకు ఎలాంటి కంటెంట్ చేయకుండా.. గత 6 నెలలుగా అజ్ఞాతంలో ఉండిపోయాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే దీప్తి సునైనాతో ప్రేమాయణం నడిపాడు షణ్ముఖ్. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి విన్నర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షన్నూ.. చివరకు రన్నరప్ అయ్యాడు. బిగ్ బాస్ షో తర్వాత దీప్తితో బ్రేకప్ తర్వాత.. మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కొన్నాళ్ల క్రితం గంజాయి సేవించాడని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య ఓ అమ్మాయిని మోసం చేశాడని.. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇంట్రెస్ట్.. ఇదే విషయం మా నాన్నకు చెప్తే… చెప్పు తెగుద్ది అన్నారని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. తాను బిగ్ బాస్ షోకు వెళ్లకుండా ఉండాల్సిందని, పొరబాటున తొందరపడి వెళ్లానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ఓ కేసులో తన పేరు వచ్చినప్పుడు.. బాధపడ్డానని, చాలా రోజులు ఆ బాధ నుంచి బయటపడలేక.. ఇక తన జీవితం అయిపోయిందనుకున్నట్లు వెల్లడించాడు. మొన్నామధ్య తన తండ్రి.. రైలు ఎక్కే టైంలో.. బీపీ తగ్గడంతో కిందపడ్డాడని, అప్పటికి కొద్ది రోజుల ముందు తన తల్లికి కేన్సర్ వ్యాధికి సంబంధించిన సర్జరీ జరిగిందని చెప్పుకొచ్చాడు. ఆ టైంలో తండ్రి ప్రమాదం గురించి చెబితే ఆమె.. ఏడిస్తే కుట్లు విడిపోతాయని ఆ బాధను దిగమింగుకున్నానని వివరించాడు. తాను ఎన్ని విజయాలు అందుకున్నా.. తండ్రికి మాత్రం మంచి కొడుకును కాలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలు మొలకలు ఏ టైంలో తినాలో తెల్సా?

పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్‌ కూడా తక్కువే

‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్

ది బెస్ట్ క్రైమ్‌ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు

అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు