పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నానబెట్టి తింటే.. మరికొందరు వీటని మొలకెత్తించి తింటారు. ఎలా తీసుకున్న ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరమే
TV9 Telugu
పెసర పప్పులో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్ వంటి అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
పోషకాలతో సమృద్ధిగా ఉండే పెసర్ పప్పు తినడం వల్ల పూర్తి ప్రయోజనాలను పొందాలంటే, సరైన సమయంలో వీటిని తినడం మంచిది
TV9 Telugu
ముఖ్యంగా వీటి మొలకలు తినడానికి సరైన సమయం ఏమిటో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం.. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని సీనియర్ డైటీషియన్ డాక్టర్ అంజలి తివారీ ఏం చెబుతున్నారంటే..
TV9 Telugu
మొలకలు తేలికైన ఆహారం. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. వీటిని ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో భోజనంలో భాగంగా చేర్చుకోవడం మంచిది
TV9 Telugu
ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఆరోగ్యాన్ని తాజాగా ఉంచుతుంది. వీటిని తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించదు
TV9 Telugu
ఇది ప్రోటీన్‌కు మంచి మూలం. నిజానికి.. వీటిని తినడానికి సరైన సమయం అంటే ఏదీ లేదు. మొలకలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా స్నాక్‌గా తీసుకోవచ్చు
TV9 Telugu
బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత తీసుకుంటే అంత మేలు. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి