పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్ కూడా తక్కువే
బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం కూడా పూర్తి చేసుకుంది.. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు వచ్చేసింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టే ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కామనర్ గా హౌస్‌లోకి వెళ్లిన ప్రియా తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ ఆమె ఎప్పుడు చూసిన గొడవలకు కాలు దువ్వడం.. అడ్డగోలుగా వాదించడం ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించింది. మొదటి రోజు నుంచి ప్రియ తన దుందుడుకు స్వభావంతో హౌస్ లో రచ్చ చేసింది. టాస్క్ ల విషయంలోనూ ప్రియా వ్యవహరించిన తీరు. అలాగే సంచాలక్ గా ఆమె చేసిన తప్పులు ఆమె ఎలిమినేషన్స్ కు కారణం అయ్యాయనే చెప్పాలి. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఈవారం ప్రియకు ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ వారం ప్రియతో పాటు రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఓటింగ్ లో ప్రియా, హరీష్ చివరిలో ఉన్నారు. అందులోనూ హరీష్ కంటే ప్రియకే తక్కువ ఓట్లు రావడంతో.. ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. గతవారం నాగార్జున ఇచ్చిన సలహాలతో ఆట మార్చినప్పటికీ.. అప్పటికీ.. ఆమెకు నెగిటివిటీ ఎక్కువగా వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ ఓటింగ్ లో స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రేక్షకులు ఆమెకు తక్కువ ఓట్లు వేశారు. అయితే మూడు వారాలకు గాను ప్రియా లక్షా 80 వేలు రెమ్యునరేషన్ గా అందుకున్నట్టు తెలుస్తోంది. రూ. 60 వేల చొప్పున..మూడు వారాలకు గాను లక్ష 80వేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్
ది బెస్ట్ క్రైమ్ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు
అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు
ఈ కథలు చిన్నతనంలో విన్నానన్న NTR
విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
