వెనక్కి వెళ్లిన అంతర్వేది సముద్రం.. భయాందోళనలో స్థానికులు
సముద్రం అంటే ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో గంభీరంగా ఉంటుంది. అందుకే బీచ్‌లకు వెళ్లేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎగసిపడే అలల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది సముద్ర తీరం వెలవెలబోతోంది. అందుకు కారణం సముద్రం వెనక్కి వెళ్లిపోవడమే.
సముద్రంలో అలలసవ్వడి తగ్గిపోయింది.. సముద్రుడు వెనక్కివెళ్లిపోవడంతో తీరప్రాంతమంతా ఎడారిని తలపిస్తోంది. దీంతో ఏం ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం తీరం ఎక్కువ దూరం వెనక్కి వెళ్లడంతో.. అక్కడ నిర్మానుష్యంగా మారింది.. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లిపోయింది. సముద్ర తీరమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండిపోయి ఎడారిలా మారింది. మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని.. సునామీవచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Abhishek Sharma: అభిషేక్ శర్మకు గిఫ్ట్ గా రూ.33 లక్షల కారు
నీ డబ్బేం వద్దు విజయ్.. నా సోదరిని నాకివ్వు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

