మన అండమాన్‌లో.. భారీ గ్యాస్ నిక్షేపాలు
అండమాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలో గ్యాస్ నిక్షేపాలు బయట పడుతున్నాయి. అండమాన్ తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సహజ వాయువు నిక్షేపాలను గుర్తించింది. తాము జరిపిన పరిశోధన బావిలో 295 మీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాల జాడ లభించినట్టు ఓఐఎల్ వెల్లడించింది.
అయితే ఈ బావి నుంచి రోజుకు ఎంత మొత్తంలో గ్యాస్ లభించే అవకాశం ఉందనే విషయంపై కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేదు. నిర్ణీత 2,650 మీటర్లు తవ్వితే గానీ దీనిపై ఒక అంచనాకు రాలేమని అధికార వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్, కాకినాడలోని లేబొరేటరీలో జరిపిన పరీక్షలో ఈ గ్యాస్‌లో 87 శాతం వరకు మిథేన్ ఉన్నట్టు తేలినట్టు ఆయిల్ ఇండియా తెలి పింది. అండమాన్ దీవులకు సమీపంలో మయన్మార్, ఇండోనేషియా తీరాల్లో ఇప్పటికే భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో అండమాన్, నికోబార్ దీవులు, వాటి తీర ప్రాంతంలోనూ భారీగానే చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ, ఓఐఎల్ కంపెనీలు రూ.3,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంత సముద్ర జలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. కాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కూడా అండమాన్ ప్రాంతంలో భారీగానే చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించారు. అండమాన్ సమీపంలోని మయన్మార్, ఇండోనేషియా తీరాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో చమురు, గ్యాస్ నిల్వలు బయటపడగా, తాజాగా అండమాన్, నికోబార్ సముద్ర తీరంలో గ్యాస్ నిక్షేపాల జాడ బయటకు రావటం విశేషం.‘ఇండియా హైడ్రోకార్బన్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీ’ నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన నిల్వలు ఉన్నట్లు అంచనా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..
ఇక.. మొబైల్ తరహాలో గ్యాస్ పోర్టబులిటీ
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు
బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

