బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్‌కు డిపోర్ట్ చేసారని పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జిత్‌కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబసభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జీత్ కౌర్‌ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు.. కొద్దిరోజుల క్రితం భారత్‌కు తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్‌లోని తార్న్‌తరణ్ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవడంతో ఆమెను 1992లో తన ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని ఈస్‌బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే సెప్టెంబర్ 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన ఆమెను రెండు గంటలపాటు కూర్చోబెట్టి.. అరెస్టు చేస్తున్నట్లు చెప్పారట. అధికారుల తీరుపై ఆమె కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్‌కు బలవంతంగా పంపేశారు. మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్‌కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అకారణంగా తనను అరెస్టు చేశారనీ తన కుటుంబసభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారనీ ఆమె వాపోయారు. హర్జీత్‌కు అమెరికాలో వర్క్ పర్మిట్ ఉంది. ఐడీ, లైసెన్స్ అన్నీ ఉన్నా ఆమెను అరెస్టు చేశారని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురుకావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత అధికారులు తన ఫొటోలు తీసుకొని ఒక రాత్రంతా ఓ గదిలో ఉంచారని చెప్పారు. తన చేతులకు బేడీలు వేసి బంధించి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్‌ఫీల్డ్‌కు తీసుకెళ్లారనీ, మందులు కూడా వేసుకోనివ్వలేదనీ అన్నారు.శాకాహారినని చెప్పినా.. అక్కడి సిబ్బంది తనకు గొడ్డుమాంసంతో కూడిన భోజనం ఇచ్చారని వాపోయారు. దీంతో తాను. చిప్స్, బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నానని చెప్పారు. ఖైదీలకు వేసినట్లు తనకు ఓ యూనిఫాం వేసి పంపేశారనీ తన మనవడు ఈ డ్రస్‌లో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మా.. అని బాధపడ్డాడనీ అని కౌర్ తెలిపారు. భారత్‌లో తనకు ఏ ఆస్తిపాస్తులూ లేవని, తన కుటుంబం అంతా అమెరికాలోనే ఉందని ఆమె వాపోయారు. స్వగ్రామంలోని తన ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదనీ, అయితే.. ఏదో ఒక విధంగా తాను అమెరికా వెళ్లి తన కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెనక్కి వెళ్లిన అంతర్వేది సముద్రం.. భయాందోళనలో స్థానికులు
మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Abhishek Sharma: అభిషేక్ శర్మకు గిఫ్ట్ గా రూ.33 లక్షల కారు
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

