AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Phani CH
|

Updated on: Sep 30, 2025 | 10:06 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరకోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఉత్తరకోస్తాంధ్ర మొత్తం ఎల్లో అలర్ట్‌ జారీ చేసారు అధికారులు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాన్ని వర్షాలు, వరదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఓవైపు ఉత్తర కోస్తా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్‌లోకి 6.55 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తుండగా, అధికారులు అంతేస్థాయిలో 6.39 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యారేజ్ దిగువన వారధి వద్ద 3 వేల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా వరద ప్రవాహం భారీగా ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. గోదావరి నుంచి 10.20 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం

నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా

మన అండమాన్‌లో.. భారీ గ్యాస్ నిక్షేపాలు

మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..

ఇక.. మొబైల్‌ తరహాలో గ్యాస్‌ పోర్టబులిటీ