ప్రసాద్ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'ఓజీ' చిత్రం గుడ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మెగా కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మెగా ఫ్యామిలీ కోసం స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. మెగా హీరోలంతా కలిసి మూవీ వీక్షించేందుకు రావడంతో థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి సినిమా చూసేందుకు వచ్చారు. వారితో పాటు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ కూడా సినిమా చూశారు. ముఖ్యంగా పవన్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య కూడా తండ్రి సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నటులు అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాపై చిరంజీవి పూర్తి రివ్యూ ఇచ్చారు. కుటుంబంతో కలిసి, ‘ఓజీ’ మూవీ యూనిట్‌తో కలిసి థియేటర్‌లో దిగిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన.. నా కుటుంబంతో కలిసి ఓజీ చూశాను. చిత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్లు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ మూవీ ఇది. భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు. ప్రతి సన్నివేశాన్నీ దర్శకుడు సుజీత్ అసాధారణరీతిలో రూపొందించాడు. పవన్ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది. తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఓజీ’తో సరైన విందు ఇచ్చాడు. తమన్ ఈ చిత్రానికి ఆత్మతో సమానం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రబృందానికి నా అభినందనలు’’ అని చిరు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్పెషల్ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుండగా, ఇప్పుడు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ సినిమాకు మరింత బజ్‌ను తీసుకొచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం
నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

