Google Pixel 8: పిక్సల్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా ఏడేళ్ల పాటు ప్రత్యేక ప్రయోజనం.. పూర్తి వివరాలు

దాదాపు ఏడేళ్ల వరకూ ఆ ఫోన్ ను వినియోగిస్తున్నట్టు గమనించింది. అంటే దాదాపు ఆరేళ్లకు పైబడి ఆ ఫోన్ యాక్టివ్‌గా ఉపయోగించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత గూగూల్ 7 ఏళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఫిక్సెల్ 8ను విడుదల చేసింది. తదుపరి మోడళ్లకు కూడా ఇదే విధంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Google Pixel 8: పిక్సల్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా ఏడేళ్ల పాటు ప్రత్యేక ప్రయోజనం.. పూర్తి వివరాలు
Google Pixel 8
Follow us

|

Updated on: Apr 02, 2024 | 3:34 PM

గూగుల్ కంపెనీ గత ఏడాది ఫిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులకు ఏడేళ్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ వారంటీ ఇచ్చింది. ఇదే కంపెనీ గతంలో 3 ఓఎస్ అప్ డేట్లు, రెండేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను మాత్రమే ఇచ్చింది. గూగుల్ కంపెనీ ఇచ్చిన వారంటీపై చర్చ జరిగింది. మార్కెట్ లో పోటీదారులకు తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందా అని కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తన ప్రతినిధి ఒకరితో ఆ వివరాలను వెల్లడించింది. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో తెలియజేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

డేటా పరిశీలన..

గూగూల్ కంపెనీ తన ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల వివరాలను పరిశీలించింది. చాలా మంది ఫోన్ ను చాలా ఎక్కువ కాలం వాడుతున్నట్టు గుర్తించింది. ఒక మోడల్ ను కొన్నేళ్ల పాటు ఉపయోగిస్తున్నట్టు వీరి విచారణలో తేలింది. 2016లో విడుదల చేసిన ఫోన్ ను ఇంకా ఎంతమంది వాడుతున్నారనే విషయాన్ని పరిశీలించింది. దాదాపు ఏడేళ్ల వరకూ ఆ ఫోన్ ను వినియోగిస్తున్నట్టు గమనించింది. అంటే దాదాపు ఆరేళ్లకు పైబడి ఆ ఫోన్ యాక్టివ్‌గా ఉపయోగించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత గూగూల్ 7 ఏళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఫిక్సెల్ 8ను విడుదల చేసింది. తదుపరి మోడళ్లకు కూడా ఇదే విధంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అనేక మార్పులు..

పిక్సెల్ ఫోన్‌ల పనితీరు క్షీణత గురించి గతంలో చాలా మంది ఫిర్యాదు చేయడాన్ని కంపెనీ గమనించింది. దీంతో అనేక మార్పులకు చర్యలు తీసుకుంది. పిక్సెల్ 6 సిరీస్ నుంచి అంతర్గత టెన్సర్ చిప్‌ను ఉపయోగించింది. ఇది కంపెనీకి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అలా ఆపిల్‌పై మెరుగైన నియంత్రణను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

అన్ని ఫీచర్లకు సపోర్టు..

అయితే ఐదేళ్ల నాటి పిక్సెల్ ఫోన్‌కు కొత్త అప్‌డేట్లు చేస్తే ఏమవుతుంది? తాజా ఫీచర్‌లకు కూడా సపోర్టు చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై సంస్థ ప్రతినిధి వివరణ ఇస్తూ.. గూగుల్ సాఫ్ట్‌వేర్ మాత్రమే ఫీచర్‌లను రూపొందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఏదైనా ర్యామ్, హార్డ్‌వేర్ తాజా ఫీచర్‌లను ఉపయోగించకుండా నిరోధించదన్నారు. రాబోయే కొద్ది నెలల్లో కొత్త పిక్సెల్ 8ఏ మోడల్‌ను తీసుకురావడానికి అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..