PKL 2025 Champion: ప్రోకబడ్డి 12వ సీజన్ విన్నర్‌గా దబాంగ్ ఢిల్లీ.. రెండో సారి టైటిల్ కైవసం
మరోసారి ప్రోకబడ్డీ టైటిల్‌ను దక్కించుకుంది దబాంగ్ ఢిల్లీ, శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై రెండు పాయింట్ల తేడాతో విక్టరీ సాధించి రెండోసారి ప్రోకబడ్డీ చాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో 30-28 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్‌ను ఢిల్లీ ఓడించింది.

ప్రోకబడ్డీ 2025 టైటిల్‌ను దక్కించుకుంది దబాంగ్ ఢిల్లీ, శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై రెండు పాయింట్ల తేడాతో విక్టరీ సాధించి రెండోసారి ప్రోకబడ్డీ చాంపియన్ గా నిలిచింది. నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 30-28 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్‌ను ఢిల్లీ ఓడించింది. టైటిల్‌ను నెగ్గేందుకు చివరి వరకు పోరాడి ఓడిన పుణేరి పల్టాన్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్ మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. చివరి వరకు జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఢిల్లీ పుణేరి పల్టన్ కంటే 2 పాయింట్లు ఎక్కువగా సాధించింది. దబాంగ్ ఢిల్లీ తరపున నీరజ్ నర్వాల్ మెరుపు వేగంతో ఆడి 9 పాయింట్లు తెచ్చిపెట్టాడు. దీని ద్వారా నీరజ్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.నీరజ్ తో పాటు అజింక్య పవార్ కూడా 6 పాయింట్లు సాధించాడు. అనుభవజ్ఞుడైన డిఫెండర్ ఫజల్ అత్రజాలి చివర్లో అద్భుతమైన టాకిల్ చేసి దబాంగ్ ఢిల్లీని ఛాంపియన్లుగా నిలిపాడు.
పుణేరి పల్టన్ జట్టు తరపున ఆదిత్య షిండే చేసిన ఒంటరి పోరాటం ఫలించలేకపోయింది. ఆట చివరిలో సూపర్ రైడ్ ద్వారా ఆదిత్య జట్టుకు విజయ ఆశను కలిగించాడు. అయితే, తదుపరి రైడ్‌కు వెళ్లిన ఆదిత్య షిండేను టాకిల్ కావడంతో పుణేరి పల్టన్ జట్టు 2 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
PKL 2025 Champions 🏆@DabangDelhiKC have been crowned the champions of @ProKabaddi Season 12 with a sensational win over @PuneriPaltan 31-28 #PKL2025 #GhusKarMaarenge #DabangDelhi #PuneriPaltan pic.twitter.com/UPMjfPOO4n
— myKhel.com (@mykhelcom) October 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,




