SA vs SL: రికార్డుల హోరులో పోరాడి ఓడిన లంక.. 102 పరుగుల తేడాతో దక్షిణఫ్రికా ఘన విజయం

వన్డే ప్రపంచకప్ 4వ మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు అద్భుత విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్‌ ఆటతీరును ప్రదర్శించి లంకేయులపై 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డి కాక్ (100), రాస్సీ వాండర్ డస్సెన్ (108), ఐడెన్ మార్క్రమ్ (106) భారీ సెంచరీలతో చెలరేగారు

Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2023 | 6:27 PM

వన్డే ప్రపంచకప్ 4వ మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు అద్భుత విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్‌ ఆటతీరును ప్రదర్శించి లంకేయులపై 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డి కాక్ (100), రాస్సీ వాండర్ డస్సెన్ (108), ఐడెన్ మార్క్రమ్ (106) భారీ సెంచరీలతో చెలరేగారు. ఈ సెంచరీల సాయంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (76; 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చరిత్ అసలంక (79; 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డాసున్ శనక (68; 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా టార్గెట్‌ మరీ పెద్దది కావడంతో లంకేయులకు ఓటమి తప్పలేదు. దక్షిణా ఫ్రికా బౌలర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, మార్కో జాన్సన్ 2, రబాడ 2, కేశవ్‌ మహారాజ్ 2, ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు. మెరుపు సెంచరీతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

రికార్డులు బద్దలు..

అంతకుముందు శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసి.. పరుగుల వరద పారించారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. ఆ వరదలో ఎన్నో రికార్డులు కొట్టుకునిపోయాయి. చరిత్రను తిరగరాస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు సౌతాఫ్రికా బ్యాటర్లు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేశారు. 428 రన్స్‌‍తో వన్డే వరల్డ్ కప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదుచేశారు. వరల్డ్‌కప్‌లో 400కి పైగా స్కోర్ చేయడం.. దక్షిణాఫ్రికాకు ఇది మూడోసారి. 2015 ఐర్లాండ్‌పై 411 పరుగులు, వెస్టిండీస్‌పై 408 పరుగులు చేసింది. అలాగే ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌ చరిత్రలో ఎక్కుసార్లు 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగానూ దక్షిణాఫ్రికా చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు సఫారీ టీమ్‌ అత్యధికంగా 8 సార్లు నాలుగువందల మార్క్‌ దాటగా.. భారత్‌ ఆరుసార్లతో రెండోస్థానంలో ఉంది. ఓవరాల్‌గా వన్డేల్లో సఫారీ జట్టుకు ఇది నాలుగో అత్యధిక స్కోరు. ఇక లంకేయులను చీల్చి చెండాడుతూ.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయిన మార్క్‌రమ్‌.. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. వన్డే విశ్వసమరంలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. అంతకుముందు ఐర్లాండ్‌ ప్లేయర్‌ కెవిన్‌ ఓబ్రైన్‌ 50 బంతుల్లో సెంచరీ బాదాడు. అతనికన్నా ఒక బాల్ తక్కువకే మార్క్‌రమ్ సెంచరీ పూర్తి చేశాడు. టాస్ గెలిచిన శ్రీలంక.. సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే వాళ్లు ఎంత పొరపాటు చేశారో తెలిసేందుకు వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆరంభంలోనే ప్రొటీస్ కెప్టెన్ బవుమా వికెట్ కోల్పోయినా.. క్వింటన్ డికాక్, డుసెన్‌లు శతకాలతో చెలరేగిపోయారు. వీరిద్దరు రెండో వికెట్ కు 214 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ పెవిలియన్ చేరాక మార్కరమ్ షో మొదలైంది. లంకేయులపై ఏ మాత్రం కనికరం చూపించకుండా ఊచకోత కోశారు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్గిడి, కగిసో రబాడ.

శ్రీలంక (ప్లేయింగ్ XI): కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మతిషా పతిరణ, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత.

దక్షిణాఫ్రికా ఆల్ రౌండ్ షో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..