ఇది మోసం కాదు.. అంతకుమించి.! వేలంలో రూ. 25.20 కోట్లు.. ఇంటికి తీసుకెళ్లేది మాత్రం రూ. 9.74 కోట్లు
IPL 2026: ఐపీఎల్ మినీ వేలంలో కామెరాన్ గ్రీన్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే అతడు వేలంలో రూ. 25.20 కోట్లకు పలికితే.. ఇంటికి తీసుకెళ్ళేది మాత్రం రూ. 9.74 కోట్లు మాత్రమే. మరి ఎందుకు ఇంత తక్కువ అని ఆలోచిస్తున్నారా.!

ఐపీఎల్ 2026 మినీ వేలంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. విదేశీ ప్లేయర్ కోటాలో కామెరాన్ గ్రీన్ రూ. 25.20 కోట్లు పలకగా.. మరో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లు రూ. 14.20 కోట్ల చొప్పున అమ్ముడయ్యారు. ఇదిలా ఉంటే.. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.20 కోట్లు వెచ్చించి కామెరాన్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. ఆ జట్టు ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేయడంతో.. ఆ ఆల్‌రౌండర్ కోటాను గ్రీన్ భర్తీ చేయనున్నాడు. వేలంలో రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. గ్రీన్ ఇంటికి తీసుకెళ్లేది కేవలం రూ. 9.74 కోట్లు మాత్రమే. ఇంతకీ కారణం ఏంటో తెలుసా.?
ఇది చదవండి: ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
కారణం ఇదే..
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మినీ వేలంలో విదేశీ ఆటగాడు ఎంత ధర పలికినా.. వారి గరిష్ట ఫీజు కేవలం రూ. 18 కోట్లు మాత్రమే.. లేదా మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడి(రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు) ధర మించకూడదు. ఆసీస్ ఆల్‌రౌండర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్ ఫీజు కింద అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్ అతడికి ఇవ్వాల్సిన వాల్యూలో రూ. 7.20 కోట్లు బీసీసీఐకు ఇవ్వనుంది. ఇక బోర్డు ఈ మొత్తాన్ని ఆటగాళ్ల సంక్షేమం కోసం ఉపయోగించనుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా.! రూ. 9.74 కోట్లు ఇంటికి తీసుకెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా.!
ఈ రూ. 18 కోట్లలో భారత్, ఆస్ట్రేలియా ట్యాక్స్‌లు పోనూ.. కామెరాన్ గ్రీన్ ఇంటికి తీసుకెళ్ళేది రూ. 9.74 కోట్లు మాత్రమే.. మొదటిగా రూ. 25.20 కోట్లలో పీడబ్ల్యూఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు రూ. 7.20 కోట్లు వెళ్లిపోగా.. రూ. 18 కోట్లు మిగులుతాయి. ఈ రూ. 18 కోట్లలో టీడీఎస్ రూ. 3.60 కోట్లు, సర్‌ఛార్జ్ రూ. 90 లక్షలు, సెస్ రూ. 18 లక్షలు పోయి.. రూ. 13.32 కోట్లు ఉంటాయి.
ఆస్ట్రేలియా ట్యాక్స్ విషయానికొస్తే.. అక్కడి ఇన్‌కమ్ ట్యాక్స్ కింద రూ. 7.90 కోట్లు, మెడికేర్ కింద రూ. 36 లక్షలు, ఫారిన్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్‌సెట్ కింద రూ. 4.68 కోట్లు రావడంతో వెరిసి గ్రీన్ ఇంటికి తీసుకెళ్ళేది కేవలం రూ. 9.74 కోట్లు మాత్రమే. ఇలా రెండు దేశాల ట్యాక్స్‌ల డిడేకషన్లు పోనూ.. ఆటగాడికి వచ్చేది నామమాత్రం శాలరీ. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆ లెక్కలపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: కపిల్‌దేవ్ అంతటివాడవుతాడని అనుకుంటే.. తుస్సుమనిపించి షెడ్డుకెళ్లాడు.. మరి రీ-ఎంట్రీ ఎలా.?
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి








