Video: 45 బంతుల్లోనే సెంచరీ.. కట్‌చేస్తే.. తగ్గేదే లే అంటూ బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్..!
Ishan Kishan Syed Mushtaq Ali Trophy Final: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో జార్ఖండ్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఒక చేతి సిక్స్‌తో తన సెంచరీని పూర్తి చేసి, ఆపై పుష్ప 2 స్టైల్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 ఫైనల్‌లో జార్ఖండ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, తనదైన శైలి సెలిబ్రేషన్స్‌తోనూ మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. హర్యానాతో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో ఇషాన్ కిషన్ సెంచరీ సాధించిన తర్వాత చేసిన ‘పుష్ప-2’ స్టైల్ సెలిబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పుష్ప స్టైల్‌లో ఇషాన్ కిషన్ ‘తగ్గేదే లే’..!
హర్యానా బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వంద పరుగులు పూర్తి కాగానే, ఇషాన్ తన బ్యాట్‌ను పక్కన పెట్టి, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమాలోని ఐకానిక్ స్టైల్‌లో “తగ్గేదే లే” అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. మైదానంలో ఇషాన్ చేసిన ఈ మేనరిజం చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ధోనీ రికార్డు బద్ధలు..
ఈ సెంచరీతో ఇషాన్ కిషన్ ఒక ప్రత్యేకమైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో జార్ఖండ్ తరపున ఒక వికెట్ కీపర్ బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను తన గురువు, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు. గతంలో దేశవాళీ టీ20ల్లో ధోనీ నెలకొల్పిన స్కోర్లను దాటి ఇషాన్ కొత్త చరిత్ర సృష్టించాడు.
అభిషేక్ శర్మ రికార్డు సమం..
Leading from the front! 🫡
Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯
The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏
Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp
— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025
కేవలం ధోనీ రికార్డు మాత్రమే కాకుండా, ఈ సీజన్‌లోనే అభిషేక్ శర్మ నెలకొల్పిన రికార్డును కూడా ఇషాన్ కిషన్ సమం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిపోయాడు. 45 బంతుల్లోనే వంద పరుగులు చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు.
సెలక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్..
గత కొంతకాలంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి, టీమ్ ఇండియాకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్.. ఈ మెరుపు సెంచరీతో సెలక్టర్లకు బలమైన సమాధానం ఇచ్చాడు. తాను మళ్ళీ ఫామ్‌లోకి వచ్చానని, తనను విస్మరించడం కష్టమని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ రాబోయే ఐపీఎల్ 2026 వేలానికి ముందు అతనికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
మైదానంలో ఇషాన్ కిషన్ బ్యాట్ ఝులిపిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పుష్ప-2 సెలిబ్రేషన్‌తో తనలో ఉన్న ‘ఫైర్’ను ఇషాన్ క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. ప్రస్తుతం జార్ఖండ్ జట్టు ఈ విజయంతో పండుగ చేసుకుంటోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








