పెరుగుతో కలిపి ఈ 5 పదార్థాలను అస్సలు తినకూడదు.. ఎందుకంటే..
పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారు ఈ కథనంలో తెలుసుకుందాం..

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగు (Curd/Yogurt) ఒక పోషకమైన ఆహారం.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. ఇంకా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.. పెరుగులోని లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే.. పెరుగును మన ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం..
పెరుగుతో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు..
ఉల్లిపాయ: రైతా తయారీలో పెరుగు.. ఉల్లిపాయలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. చాలా మందికి ఇది ఇష్టం. కానీ ఉల్లిపాయ, పెరుగు కలిపి తినడం వల్ల అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
పాలు: పాలు – పెరుగు వేర్వేరు ప్రభావాలను కలిగిస్తాయి. దీనివల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, పాలు – పెరుగును కలిపి తినకూడదు.
వేయించిన ఆహారాలు: పెరుగును వేయించిన ఆహారాలతో కలిపి తినకూడదు. వేయించిన ఆహారాలతో కలిపి పెరుగు తినడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు పెరుగుతారు.
చేప: చేపలు – పెరుగు కలిపి తినకూడదు. ఇది శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది.. అంతేకాకుండా, ఇది చర్మ అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ – కడుపు నొప్పులు వంటి సమస్యలను కలిగిస్తుంది.
పుల్లని పండ్లు: పెరుగును పుల్లని పండ్లతో తినకూడదు.. పెరుగు, పండ్లు జీర్ణ స్వభావాల్లో వ్యత్యాసం ఉంటుంది.. ఇది అజీర్ణం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అలాగే.. మసాలా పదార్థాలతో కలిపి పండ్లను తినకూడదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







