ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా.. అసలు నిజాలు తెలుసుకోండి..
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెంపుడు జంతువులను పెంచుకోవచ్చా అనే దానిపై ప్రముఖ డాక్టర్ హరిణి శ్రీ కొన్ని కీలక సూచనలు చేశారు. పిల్లల వయస్సు, పరిశుభ్రత, పెంపుడు జంతువుల విశ్రాంతికి భంగం కలిగించకపోవడం, బెడ్ రూమ్‌లోకి వాటిని అనుమతించకపోవడం, పెద్దల పర్యవేక్షణ వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. సరైన నియమాలు పాటిస్తేనే పిల్లలు, పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి.

చాలా మందికి ఇంట్లో కుక్కలనో, పిల్లులనో పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెంపుడు జంతువులను పెంచుకోవాలా? వద్దా అనే డౌట్ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. జంతువుల బొచ్చు, గోళ్లు లేదా అవి కరుస్తాయేమో అన్న భయం కలగడం సహజం. మరి పిల్లలు ఉన్న ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం సురక్షితమేనా? దీనిపై ప్రముఖ డాక్టర్ హరిణి శ్రీ కొన్ని కీలక సూచనలు చేశారు.
పిల్లల వయస్సు ముఖ్యం
పిల్లలు 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడే ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఉత్తమం. 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జంతువులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు కాబట్టి ఆ వయస్సు లోపు వాటిని దూరంగా ఉంచడమే క్షేమం. 5 ఏళ్లు దాటిన పిల్లలకు జంతువులకు ఆహారం పెట్టడం, వాటిని ప్రేమించడం నేర్పడం వల్ల వారిలో బాధ్యత పెరుగుతుంది.
ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి
పరిశుభ్రత: పెంపుడు జంతువులతో ఆడుకున్నాక లేదా వాటిని తాకిన తర్వాత పిల్లలు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కునేలా చూడాలి. దీనివల్ల బ్యాక్టీరియా, అలర్జీలు సోకకుండా ఉంటాయి. అలాగే పెంపుడు జంతువులకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించాలి.
విశ్రాంతిని భంగం కలిగించవద్దు: పెంపుడు జంతువులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా ఆహారం తింటున్నప్పుడు పిల్లలు వాటిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఆ సమయంలో వాటిని కదిలిస్తే అవి ఒక్కోసారి కోపంతో దాడి చేసే అవకాశం ఉంటుంది.
బెడ్ రూమ్ లోకి నో ఎంట్రీ: మీరు మీ పెంపుడు జంతువులను ఎంతగా ప్రేమిస్తున్నా, వాటిని బెడ్ రూమ్ లోకి రానివ్వకూడదు. పెంపుడు జంతువుల జుట్టు రాలడం వల్ల పిల్లల్లో ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పర్యవేక్షణ: పిల్లలు, పెంపుడు జంతువులు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ పెద్దల పర్యవేక్షణ ఉండాలి. జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
పెంపుడు జంతువులు పిల్లలకు మంచి స్నేహితులుగా మారతాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చుఈ నియమాలు పాటిస్తే పిల్లలు, పెంపుడు జంతువులు ఒకే ఇంట్లో సురక్షితంగా ఉండవచ్చు.
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








