తుప్పల్లో ఉంటుందని చీప్‌గా చూసేరు.. కిడ్నీల్లో రాళ్లను పిప్పిచేసే దివ్యౌషధం.. ఇంకా ఎన్నో..
కిడ్నీలో రాళ్లకు మూల కారణం యూరిక్ యాసిడ్ పెరుగుదల. దీనిని సకాలంలో నియంత్రించకపోతే, ఇది ఆర్థరైటిస్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, వాపు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, కిడ్నీలో రాళ్లు కిడ్నీ వైఫల్య ప్రమాదాన్ని పెంచుతాయి.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అలాంటి సమస్యల్లో మూత్రపిండాల్లో రాళ్లు ఒకటి.. కిడ్నీలో రాళ్లకు మూల కారణం యూరిక్ యాసిడ్ పెరుగుదల.. దీనిని సకాలంలో నియంత్రించకపోతే, ఆర్థరైటిస్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, వాపు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కిడ్నీలో రాళ్లు మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. మందులతో పాటు, కొన్ని ఆయుర్వేద మూలికలతో.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అలాంటి ఒక ఆయుర్వేద మూలిక తిప్పతీగ. దీనిని ఆయుర్వేదంలో అమృతవల్లిగా పేర్కొంటారు.. ఈ తిప్పతీగ ఆకులు, వేర్లు అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.. తిప్పతీగను ఆయుర్వేద మందులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మీరు యూరిక్ యాసిడ్ సమస్యలతో పోరాడుతుంటే దీని ఆకులు, వేర్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
తిప్పతీగ తాజా ఆకులు, కాండాలను కత్తిరించి.. బాగా ఎండబెట్టి, పొడి చేయాలి. ఒక గిన్నెలో 1 గ్లాసు నీరు, కొంత పొడిని సగం అయ్యే వరకు మరిగించి, తరువాత వడకట్టి త్రాగాలి. ఇది క్యాన్సర్, మధుమేహాన్ని కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
తిప్పతీగ ఎన్నో సమస్యలకు రామబాణం..
తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మధుమేహం – గుండె జబ్బులను నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అయితే.. మీకు ఏమైనా సమస్యలుంటే.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







