AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAT 2026 Result Date: క్యాట్‌ 2026 ఫలితాల విడుదల తేదీ ఇదే.. ఫైనల్ ఆన్సర్ కీ ఇదిగో!

కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) తుది ఆన్సర్‌ కీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ తాజాగా విడుదల చేసింది. తాత్కాలిక ఆన్సర్‌ కీ ఇటీవల విడుదల చేయగా డిసెంబర్‌ 8 నుంచి 10 వరకు దీనిపై అభ్యరంతరాలను స్వీకరించింది. మొత్తం 3 షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షల నుంచి..

CAT 2026 Result Date: క్యాట్‌ 2026 ఫలితాల విడుదల తేదీ ఇదే.. ఫైనల్ ఆన్సర్ కీ ఇదిగో!
CAT 2026 Exam Result Date
Srilakshmi C
|

Updated on: Dec 19, 2025 | 8:02 AM

Share

హైదరాబాద్, డిసెంబర్‌ 19: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) తుది ఆన్సర్‌ కీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ తాజాగా విడుదల చేసింది. తాత్కాలిక ఆన్సర్‌ కీ ఇటీవల విడుదల చేయగా డిసెంబర్‌ 8 నుంచి 10 వరకు దీనిపై అభ్యరంతరాలను స్వీకరించింది. మొత్తం 3 షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షల నుంచి మొత్తం 187 అభ్యంతరాలు స్వీకరించింది. వీటన్నింటిలో ఒక అభ్యంతరాన్ని మాత్రమే స్వీకరించినట్లు తెలిపింది. ఈ మేరకు తుది కీ రూపొందించి విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలను కూడా వెల్లడించనుంది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 170 న‌గ‌రాల్లో నవంబర్‌ 30న ఆన్‌లైన్‌ విధానంలో క్యాట్ 2026 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా ఐఐఎంలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా పలు ప్రఖ్యాత కాలేజీల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు. జనవరి మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ICAI CA January 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 2026లో చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ICAI విడుదల చేసింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి హాల్ టికెట్లను eservices.icai.org డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 5 నుంచి 24 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

ఐసీఏఐ సీఏ-2026 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.