- Telugu News Photo Gallery Cricket photos Team India Star Player Shubman Gill Is Also Likely To Miss 2nd Match India Vs Afghanistan In ICC World Cup 2023
Team India: టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన నంబర్ 2 ప్లేయర్.. ఎందుకంటే?
Shubman Gill Miss First Two Matches of World Cup: గిల్ ఆరోగ్యంగా లేడని, మొదటి రెండు మ్యాచ్‌లు ఆడేందుకు అతడు ఫిట్‌గా లేడని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. శుక్రవారం చెన్నైలో మీడియాతో ద్రవిడ్ మాట్లాడుతూ, “గిల్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. బాగానే ఉన్నాడు. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోందని" తెలిపాడు. చెన్నైలో దిగిన తర్వాత శుభ్‌మన్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. శిక్షణ సమయంలో గిల్ డెంగ్యూతో బాధపడ్డాడు.
Updated on: Oct 07, 2023 | 9:18 PM

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడని, ఆదివారం (అక్టోబర్ 8) ఆస్ట్రేలియాతో జరిగే ICC పురుషుల ODI ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని వార్తలు వినిపించాయి. దీంతో పాటు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది 20 వన్డేల్లో 1230 పరుగులు చేసి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 2వ ర్యాంక్‌లో నిలిచిన గిల్ గైర్హాజరు జట్టుకు భారీ నష్టమేనని తెలుస్తోంది. అలాగే డెంగ్యూ పరీక్షలు మరోసారి చేసినట్లు, దీంతో మొదటి రెండు మ్యాచ్‌లు కూడా ఆడే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్ గిల్ ఆదివారం చెన్నైలో జరిగే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు మాత్రమే కాకుండా, అక్టోబర్ 11న ఢిల్లీలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే రెండవ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

గిల్ అనారోగ్యాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఇంకా 36 గంటలు మిగిలి ఉండగానే గిల్‌ని పక్కనబెట్టే ప్రసక్తే లేదని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. అయితే, మొదటి రెండు మ్యాచ్‌ల్లో గిల్ ఆడడని బీసీసీఐ వర్గాలు ఇప్పుడు వార్తా సంస్థ తెలిపింది.

గిల్ ఆరోగ్యంగా లేడని, మొదటి రెండు మ్యాచ్‌లు ఆడేందుకు అతడు ఫిట్‌గా లేడని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. శుక్రవారం చెన్నైలో మీడియాతో ద్రవిడ్ మాట్లాడుతూ, “గిల్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. బాగానే ఉన్నాడు. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోందని" తెలిపాడు. చెన్నైలో దిగిన తర్వాత శుభ్‌మన్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. శిక్షణ సమయంలో గిల్ డెంగ్యూతో బాధపడ్డాడు.

అతని గైర్హాజరు జట్టుకు పెద్ద దెబ్బ. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అతనికి బదులుగా ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. గిల్ గైర్హాజరీ తర్వాత భారత్‌కు మరో షాక్ తగిలింది. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా వేలికి గాయమైంది. అతని గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియరాలేదు. అయితే, గాయపడిన తర్వాత అతను బ్యాటింగ్ చేయలేదు.




