- Telugu News Photo Gallery Cricket photos Odi world cup 2023 Virat Kohli Most Catches in one day world cup for indian cricket team as fielder in India vs Australia match in chennai
ODI World Cup 2023: క్యాచ్‌లతో కేక పుట్టిస్తోన్న కింగ్ కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌లో సరికొత్త చరిత్ర..
Virat Kohli: 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులో చేరాడు. కాగా, విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 306 క్యాచ్‌లు అందుకున్నాడు. టెస్టులో 110 క్యాచ్‌లు, 146 వన్డేలు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 50 క్యాచ్‌లు అందుకున్నాడు. 2008 నుంచి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండటం గమనార్హం.
Updated on: Oct 08, 2023 | 7:07 PM

Most Catches For India In ODI World Cup: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు అతని అద్భుతమైన, చురుకైన ఫీల్డింగ్‌తో మైదానంలో సందడిచేస్తుంటాడు. తాజాగా ప్రపంచ కప్ 2023లో కింగ్ కోహ్లి ఫీల్డర్‌గా భారీ విజయాన్ని సాధించాడు. దీంతో ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.

టీమ్ ఇండియా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో తన మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఇందులో ఒక క్యాచ్ తీసుకోవడం ద్వారా, విరాట్ కోహ్లీ భారతదేశం తరపున ప్రపంచ కప్‌లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

ప్రపంచకప్‌లో 15వ క్యాచ్‌ని మిచెల్ మార్ష్ రూపంలో కోహ్లీ అందుకున్నాడు. బుమ్రా వేసిన బంతిని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, కింగ్ కోహ్లీ ఎడమవైపుకి డైవింగ్ చేస్తూ అద్భుత క్యాచ్ పట్టాడు. ప్రపంచకప్‌లో ఫీల్డర్‌గా అతనికి ఇది 15వ క్యాచ్. ప్రస్తుతం భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 14 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

ప్రపంచకప్‌లో మాజీ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ తలో 12 క్యాచ్‌లతో జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 11 క్యాచ్‌లతో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నారు. టాప్-6 జాబితాలో విరాట్ కోహ్లి మినహా ప్రస్తుత ఆటగాడు లేకపోవడం గమనార్హం.

విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 306 క్యాచ్‌లు అందుకున్నాడు. టెస్టులో 110 క్యాచ్‌లు, 146 వన్డేలు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 50 క్యాచ్‌లు అందుకున్నాడు. 2008 నుంచి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండటం గమనార్హం.




