- Telugu News Photo Gallery Cricket photos ICC World Cup 2023 From Ishan kishan to Rohit sharma India Lose 3 Early Wickets In Just 2 Runs Vs Australia
IND vs AUS: 0,0,0.. ఖాతా తెరవని కిషన్, రోహిత్, శ్రేయస్.. 1983 వరల్డ్ కప్ మ్యాచ్ రిపీట్?
ICC World Cup 2023: ఆస్ట్రేలియా ఇచ్చిన చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లలోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురు సున్నాకే పెవిలియన్ చేరారు. టీమిండియా తరపున ఓపెనింగ్‌క వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవలేకపోయారు.
Updated on: Oct 08, 2023 | 8:49 PM

చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ప్రపంచకప్ సమరంలో ఈ చెత్త రికార్డ్ నమోదైంది. ఆసీస్ జట్టును తక్కువకే కట్టడి చేసిన భారత్.. లక్ష్యాన్ని ఛేదించడంలో తంటాలు పడుతోంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియా జట్టును కేవలం 199 పరుగులకే కట్టడి చేసింది. జడేజా ఆసీస్ జట్టును ఇబ్బంది పెట్టాడు.

భారత బౌలర్ల ధాటికి ముందు ఆసీస్ జట్టులో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్మిత్, వార్నర్ మాత్రమే 40 పరుగుల మార్కును దాటారు.

ఆస్ట్రేలియా ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లలోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియాకు ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా ఖాతా తెరవలేకపోయారు.

తొలి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ ఆ ఓవర్ 4వ బంతికి వికెట్ తీశాడు. తన తొలి డెలివరీని ఎదుర్కొన్న కిషన్ ఆసీస్ బౌలర్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

రెండో ఓవర్ మూడో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీగా ఔట్ అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ ఖాతా తెరవలేకపోయాడు.

ఇద్దరు ఓపెనర్లు సున్నాకే వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా 2వ ఓవర్ చివరి బంతికి డేవిడ్ వార్నర్ చేతికి చిక్కాడు. ఈ సమయానికి భారత్ ఖాతాలో కేవలం 2 పరుగులే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

1983 ప్రపంచకప్‌లోనూ టీమిండియా ఓపెనర్లు సున్నాకే పెవిలియన్ చేరారు. మరలా ఇన్నాళ్లు టీమిండియా ఓపెనర్స్ జీరోకే పెవిలియన్ చేరారు. కాగా, జింబబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కపిల్ 175 స్కోర్ నమోదు చేసిన మ్యాచ్ అదే.




