- Telugu News Photo Gallery Cricket photos From Virat Kohli To David Warner Check All Records Created In India Vs Australia ICC World Cup 2023 Match
IND vs AUS: 36 ఏళ్లలో తొలిసారి ఓటమి.. భారత్-ఆసీస్ పోరులో నమోదైన రికార్డులు ఇవే..
IND vs AUS: టీమ్ ఇండియా ICC ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించి ఐదుసార్లు ఛాంపియన్‌కు షాక్ ఇచ్చింది. దీంతో ముఖ్యంగా టీమిండియాకు బలహీనంగా మారిన మిడిలార్డర్ సమస్య తీరినట్లైంది. కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ సమన్వయంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ విజయంతో భారత్ కొన్ని చెత్త రికార్డులను లిఖించగా, ఓడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు అద్భుతమైన రికార్డులను సృష్టించారు.
Updated on: Oct 09, 2023 | 4:10 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంతో ఆరంభించింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించి ఐదుసార్లు ఛాంపియన్‌కు షాక్ ఇచ్చింది. ఈ విజయంతో భారత్ కొన్ని చెత్త రికార్డులను లిఖించగా, ఓడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మరికొన్ని అద్భుతమైన రికార్డులను సృష్టించారు.

టీమిండియాపై 52 బంతుల్లో 6 బౌండరీలతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రికార్డు సృష్టించాడు.

టీమిండియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు పూర్తి చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

దీనికి తోడు అవాంఛిత రికార్డు కూడా సాధించిన ఆసీస్.. 1992 తర్వాత వన్డే ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్‌లో 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌పై ఓడిపోయింది.

అంతేకాకుండా కోహ్లి, కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాపై ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టిన విరాట్.. ప్రపంచకప్‌లో 14 క్యాచ్‌లతో రికార్డు సృష్టించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు.

వీటన్నింటి మధ్య, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సున్నాకే పెవిలియన్ చేరి చెత్త రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ ముగ్గురూ వన్డే చరిత్రలో తొలిసారిగా ఒకే ఇన్నింగ్స్‌లో పెవిలియన్ చేరి చెత్త రికార్డు సృష్టించారు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టిన విరాట్.. ప్రపంచకప్‌లో 14 క్యాచ్‌లతో రికార్డు సృష్టించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు.

ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు. టీ20 + వన్డే + ఛాంపియన్స్ ట్రోఫీతో సహా 64 ICC ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ప్రస్తుతం 2720 పరుగులు, సచిన్ 58 ఇన్నింగ్స్‌లలో 2719 పరుగులు చేశాడు.




