- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli breaks Sachin Tendulkar’s run chase record during India vs Australia World Cup 2023 5th match
IND vs AUS: సచిన్ టెండూల్కర్‌ను బీట్ చేసిన రన్ మెషీన్.. దటీజ్ ఛేజ్ మాస్టర్ అంటోన్న ఫ్యాన్స్.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటో తెలుసా?
The Chase Master Virat Kohli Surpassed Sachin Tendulkar: టీమిండియా కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విజయతీరాలకు చేర్చాడు. అనంతరం జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి పెవిలియన్ చేరాడు. అయితే, సెంచరీకి 15 పరుగుల దూరంలో పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో రన్ మెషీన్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 09, 2023 | 4:46 PM

ఆదివారం చెన్నైలో జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా 5వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదిలోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఆసీస్ బౌలర్లు.. కోలుకోనివ్వకుండా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సమన్వయంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది, ఊహించిన విజయాన్ని నమోదుచేశారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నమోదుచేశారు. అందులో ముఖ్యంగా విజయవంతమైన ఛేజింగ్‌లలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాపై 200 పరుగుల ఛేదనలో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ 116 బంతుల్లో 85 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 92 ఇన్నింగ్స్‌లలో 88.98 సగటుతో 5,517 పరుగులు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డ్ టీమిండియా దిగ్గజ ప్లేయర్ సచిన్ పేరుతో నమోదైంది. మొత్తంగా 124 ఇన్నింగ్స్‌లలో 5,490 పరుగులు సాధించి భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్నాడు.

2 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విజయతీరాలకు చేర్చాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లి ఔట్ అయ్యాడు. సెంచరీకి 15 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు.




