iBomma Ravi: ఐబొమ్మ రవి వెనుక ప్రహ్లాద్.. ఆ వ్యక్తి గురించి తెలిస్తేనే అసలు కథ బయటకు..
ఐబొమ్మ రవి కేసు మలుపులు తిరుగుతుంది. అతడిని మారోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12 రోజులపాటు అతడిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వగా.. చంచల్ గూడ జైలులో ఉన్న రవిని మూడోసారి కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, వాటిలో నాలుగు కేసుల్లో ప్రశ్నించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజులు కస్టడీలో ఉంచి విచారించేందుకు అనుమతించింది. దాంతో ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. తొలిరోజు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు మౌనం పాటించిన ఐబొమ్మ రవి.. HD సినిమా పైరసీపై ఎట్టకేలకు నోరువిప్పినట్లు తెలిసింది. సినిమాల డిజిటల్ ప్రసారానికి ఉపయోగించే క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం రవి హ్యాక్ చేసినట్టు విచారణలో తేలింది. శాటిలైట్ లింక్‌ను వినియోగించి HD ఫార్మాట్‌లో సినిమాలను రికార్డ్ చేసినట్టు గుర్తించారు. ఈ పైరసీ కంటెంట్‌ను టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విక్రయించిన ఐబొమ్మ రవి, ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..
హిట్, తండేల్, కిష్కింధపురి, హిట్-3, OG సహా మరికొన్ని సినిమాలను కూడా శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్టు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో మూడు గంటలు సాగిన తొలిరోజు విచారణలో పూర్తిగా సర్వర్ల అంశంపైనే ఫోకస్ పెట్టారు పోలీసులు. విదేశాల్లో దాచిన సర్వర్ల గురించి ఆరా తీశారు. మూవీ రూల్స్ నుంచి ఒక్కో సినిమాను ఎంత పెట్టి కొనుగోలు చేశాడనే అంశంపై లోతుగా ప్రశ్నించారు. పైరసీకి ఉపయోగించిన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్న మిగతా అడ్మిన్‌ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. ఈ విచారణలో రవిపైరసీ నెట్‌వర్క్, బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..
అలాగే ఐబొమ్మ రవిని మరోసారి విచారించగా.. టచ్ లో ఉన్న మరికొందరు పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్ డీ సినిమాలను ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడని తెలుస్తోంది. తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. ప్రసాద్ తన పదో తరగతి స్నేహితుడని చెప్పినట్లు సమాచారం. ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయని తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..



