AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ముస్లిం అమ్మాయితో ప్రేమ.. ఒప్పుకోని పేరెంట్స్.. కట్‌చేస్తే.. కిక్ మూవీ ఛేజింగ్‌ సీన్ రిపీట్

Shivam Dube and Anjum Khan Love Marriage: టీం ఇండియా ఆటగాడు శివం దుబే, అంజుమ్ ఖాన్ ల ప్రేమ వివాహం మతాలకు అతీతంగా జరిగింది. దీంతో వీరి వివాహం చాలా విమర్శలను ఎదుర్కొంది. అంజుమ్ ఖాన్ కంటే వయసులో చిన్నవాడైన శివం దుబే.. పెండ్లి కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. శివం దుబే కుటుంబం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం..

Team India: ముస్లిం అమ్మాయితో ప్రేమ.. ఒప్పుకోని పేరెంట్స్.. కట్‌చేస్తే.. కిక్ మూవీ ఛేజింగ్‌ సీన్ రిపీట్
Shivam Dube And Anjum Khan Love Marriage
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2025 | 4:57 PM

Shivam Dube and Anjum Khan Love Marriage: క్రికెట్ ప్రపంచంలో ప్రత్యర్థి జట్ల మధ్య హోరాహోరీ పోరే కాదు.. ఆటగాళ్ల ప్రేమకథలు కూడా చర్చలోకి వస్తుంటాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు నటీమణులతో సంబంధాల గురించి తరుచుగా వార్తల్లోకి వస్తుంటాయి. ఈ లిస్టులో చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. మతాలు వేరేయినా తమ ప్రేమ కోసం ఎన్నో అవాంతరాలను దాటి ఒక్కటవుతుంటారు. ఈ లిస్ట్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివం దుబే కూడా చేరిపోయాడు.

శివం దుబే తనకంటే 6 సంవత్సరాలు ఎక్కువ వయసు గల ఆమెతో డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నాడు. చాలా మంది క్రికెట్ అభిమానులకు ఈ విషయం తెలియదు. శివం దూబే తన వివాహం తర్వాత చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దీనికి ఏకైక కారణం శివం దూబే మతం సంకెళ్లను తెంచుకుని వివాహం చేసుకున్నాడు. దుబే ప్రేమకథ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

టీం ఇండియా తుఫాన్ ఆల్ రౌండర్ శివం దూబే భార్య పేరు అంజుమ్ ఖాన్. వారిద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు. అంజుమ్ ఖాన్ ముస్లిం కావడంతో దుబే కుటుంబం ఈ వివాహానికి అంగీకరించలేదు. కానీ, దూబే తన ప్రేమకు కట్టుబడి ఉన్నాడు. 2019లో టీమ్ ఇండియా తరపున దూబే అరంగేట్రం చేశాడు. కానీ, వివాదంలో ఉన్నప్పటికీ కోవిడ్ యుగంలో అద్బుతంగా రాణించి ఆకట్టుకున్నాడు.

పెళ్లి ఎలా జరిగిందంటే?

View this post on Instagram

A post shared by shivam dube (@dubeshivam)

అంజుమ్ ఖాన్ శివం దూబే కంటే 6 సంవత్సరాలు పెద్దది. అంజుమ్ 1986 సెప్టెంబర్ 2న జన్మించగా, దుబే 1993 జూన్ 26న జన్మించారు. హిందూ ఆచారాలతో పాటు, ముస్లిం ఆచారాల ప్రకారం దుబే, అంజుమ్ ఖాన్ వివాహం చేసుకున్నారు. దీని కోసం వీరిద్దరూ చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అంజుమ్ ఖాన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అంజుమ్ ఖాన్ మోడలింగ్ కూడా చేయడంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత, శివం దూబే, అంజుమ్ ఖాన్‌లకు ఒక మగబిడ్డ పుట్టాడు. దూబే ఫిబ్రవరి 2022లో తండ్రి అయ్యాడు. దుబే కొడుకు పేరు అయాన్. ప్రస్తుతం అతనికి రెండు సంవత్సరాలు. దూబే ప్రస్తుతం టీం ఇండియాలో భాగం. 2019లో టీం ఇండియా నుంచి తొలగించిన తర్వాత, అతను మరోసారి IPL ద్వారా తిరిగి వచ్చాడు. అతను 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..