Rohit Sharma: వన్డేలు, టెస్టుల రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడుగా

రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెల్చుకుంది. అలాగే 13 ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అయితే టీ20 ప్రపంచకప్ గెల్చిన వెంటనే విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఆకస్మికంగా టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు

Rohit Sharma: వన్డేలు, టెస్టుల రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడుగా
Rohit Sharma
Follow us

|

Updated on: Jul 15, 2024 | 12:03 PM

రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెల్చుకుంది. అలాగే 13 ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అయితే టీ20 ప్రపంచకప్ గెల్చిన వెంటనే విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఆకస్మికంగా టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ముఖ్యంగా రోహిత్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. అదే సమయంలో ప్రపంచకప్ విజయంతో రోహిత్ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంపై చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్ శర్మ తాజాగా వన్డే, టెస్టు క్రికెట్‌ కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ T20I రిటైర్మెంట్ తర్వాత, క్రికెట్ అభిమానులు కూడా హిట్‌మ్యాన్ వన్డే, టెస్ట్ కెరీర్‌పై చర్చించుకుంటున్నారు. అయితే ఈ రెండు ఫార్మాట్లలో రోహిత్ ఆడటం కొనసాగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి రోహిత్ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తద్వారా వన్డేలు, టెస్టుల్లో రోహిత్ సారథ్యం వహించడం ఖాయం. ఇంతలోనే ఒక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా వన్డేలు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు రోహిత్ అమెరికా వెళ్లాడు. అక్కడ రోహిత్‌కి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎదురయ్యాయి. ‘భవిష్యత్తుకు సంబంధించి నేను ఎలాంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదు. నేను అంత దూరం అనుకోను. కాబట్టి మరికొంత కాలం నేను ఆడటం మీరు చూడవచ్చు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ తన పేరు మీద T20 ప్రపంచ కప్ విజయంతో సహా అనేక రికార్డులను సృష్టించాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి కెప్టెన్ రోహిత్. అలాగే టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియా తరఫున 50 మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్ రోహిత్. అలాగే టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ తన T20I కెరీర్‌లో 159 మ్యాచ్‌లలో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీల సహాయంతో 4, 231 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..