Team India: బిజీబిజీగా టీమిండియా.. రాబోయే ఐపీఎల్ వరకు భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదిగో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభించింది టీమిండియా. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ సుమారు నెల రోజుల పాటు జరగనుంది. ఆ తర్వాత కూడా భారత జట్టు పలు సిరీస్‌లు ఆడనుంది.

Team India
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభించింది టీమిండియా. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ సుమారు నెల రోజుల పాటు జరగనుంది. ఆ తర్వాత కూడా భారత జట్టు పలు సిరీస్‌లు ఆడనుంది. దీని ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్ వరకు టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
- T20 ప్రపంచ కప్ 2024: T20 ప్రపంచ కప్ జూన్ 2 నుండి జూన్ 29 వరకు జరుగుతుంది. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ లో భారత జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.
- భారత్ వర్సెస్ జింబాబ్వే: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభమై జూలై 14న ముగుస్తుంది.
- భారత్ వర్సెస్ శ్రీలంక: శ్రీలంకతో టీమిండియా 6 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. జూలై-ఆగస్టు నెలలో జరిగే ఈ సిరీస్‌లో ఇరు జట్లు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
- భారత్ vs బంగ్లాదేశ్: సెప్టెంబర్ నెలలో బంగ్లాదేశ్‌తో భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి.
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్: అక్టోబర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌కి కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్-డిసెంబర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ మరియు ఆస్ట్రేలియా మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.
- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: 2025లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి సిరీస్ ఆడనుంది. జనవరి-ఫిబ్రవరి మధ్య భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో టీమిండియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి.
- ఐపీఎల్ 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఏప్రిల్, మే నెలల్లో జరగనుంది.
ఇవి కూడా చదవండి
టీ 20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్రాక్టీస్..
🗣️ Getting back with an Indian jersey 🔛 is a different feeling altogether 🇮🇳@RishabhPant17 is back in the nets for #TeamIndia 🤩
Crucial practice before the #T20WorldCup begins 💪
WATCH 🎥🔽 – By @RajalArora
— BCCI (@BCCI) May 30, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




