AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఆ ప్రముఖ కామెంటేటర్‌కు కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపులు.. ఏకంగా చంపేస్తామంటూ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

ఇటీవల ముగిసిన IPL 17వ ఎడిషన్‌లో, RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేశారు. త ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడం మాత్రమే కాకుండా, ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. దీంతో సహజంగానే అందరూ కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు

Virat Kohli: ఆ ప్రముఖ కామెంటేటర్‌కు కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపులు.. ఏకంగా చంపేస్తామంటూ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
Virat Kohli
Basha Shek
|

Updated on: May 30, 2024 | 5:19 PM

Share

ఇటీవల ముగిసిన IPL 17వ ఎడిషన్‌లో, RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేశారు. త ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడం మాత్రమే కాకుండా, ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. దీంతో సహజంగానే అందరూ కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. అయితే ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ, కోహ్లీ స్ట్రైక్ రేట్‌ తక్కువగా ఉందంటూ కొందరు మాజీ ఆటగాళ్లు విరాట్ ను విమర్శించారు. స్ట్రైక్ రేట్ విషయంలో కోహ్లీపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలన్నింటిపై స్పందించిన కోహ్లి.. మైదానంలో ఆడేవారికే ఆట తీవ్రత అర్థమవుతుందని చెప్పి అందరి నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. ఇంతలో, విరాట్ కోహ్లీని విమర్శించినందుకు అతని అభిమానుల నుంచి తనకు హత్యా బెదిరింపులు వచ్చాయంటూ ఒక మాజీ వెటరన్ క్రికెటర్, ప్రస్తుత ప్రముఖ కామెంటేటర్ సంచలన ప్రకటన చేశాడు. అతను మరెవరో కాదు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్.

కొన్ని రోజుల క్రితం సునీల్ గవాస్కర్‌తో పాటు సైమన్ డౌల్ కూడా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడాడు. ‘ టీ 20 క్రికెట్ లో కూడా కోహ్లి గొప్ప ఆటగాడిగా ఆధిపత్యం చెలాయించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే అతని స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడతాను. బహుశా కోహ్లీ ఔట్ అవుతాడనే భయంతో బ్యాట్ సరిగా ఝుళిపించడం లేదేమో. ఇదే విషయాన్ని బాబర్ ఆజామ్ ‌తో కూడా చెప్పాను. దీనికి బాబర్ సమాధానమిస్తూ, నా కోచ్ కూడా అదే చెప్పాడని చెప్పాడు. కానీ విరాట్ కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ఈ ఏడాది సిక్స్‌లు కొట్టాలనే కింగ్ కోహ్లీ ఉద్దేశం నాకు బాగా నచ్చింది. కాబట్టి కోహ్లి ఔట్ కావడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను’

ఇవి కూడా చదవండి

“ఇప్పటి వరకు నేను విరాట్ కోహ్లీ గురించి వేల సానుకూల విషయాలు చెప్పాను. కానీ నేను అతని గురించి ఒక ప్రతికూల విషయం చెప్పినప్పుడు నేను కోహ్లీ శత్రువగా పరిగణిస్తున్నారు. అతని అభిమానుల నాకు హత్యా బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఇది చాలా సిగ్గుచేటు’. ‘‘ఈ ఏడాది కోహ్లీ చేసిన స్లాగ్ స్వీప్ షాట్ నాకు బాగా నచ్చింది. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు నాకు ఉంది. నేను భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆటగాళ్లకు సహకరించడానికి ఇష్టపడతాను. కోహ్లీతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మ్యాచ్‍లు ముగిసిన తర్వాత చాలాసార్లునేను, విరాట్ మాట్లాడుకున్నాం’ అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..