AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: భారీ వర్షంలో ఫొటో అడిగిన అభిమాని.. రోహిత్ ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శిక్షణ శిబిరంలో చెమటోడ్చాడు. ఈ టోర్నీని విజయంతో ప్రారంభించాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి బలహీనమైన జట్టు  అయినప్పటికీ తేలికగా తీసుకోకూడదని భారత జట్టు భావిస్తోంది.

T20 World Cup 2024: భారీ వర్షంలో ఫొటో అడిగిన అభిమాని.. రోహిత్ ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్
Rohit Sharma
Basha Shek
|

Updated on: May 30, 2024 | 6:53 PM

Share

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శిక్షణ శిబిరంలో చెమటోడ్చాడు. ఈ టోర్నీని విజయంతో ప్రారంభించాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి బలహీనమైన జట్టు  అయినప్పటికీ తేలికగా తీసుకోకూడదని భారత జట్టు భావిస్తోంది. అందుకే జూన్ 5న ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్‌ కోసం అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలా ప్రపంచకప్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఇద్దరూ రోడ్డుపై కనిపించారు. రోహిత్ శర్మ స్లిప్పర్స్‌లో, రాహుల్ ద్రవిడ్ టీ-షర్ట్ షార్ట్‌లో నడుస్తున్నట్లు దర్శనమిచ్చారు. . వివరాల్లోకి వెళితే.. ప్రాక్టీస్ లేని సమయంలో టీమిండియా ఆట‌గాళ్లు న్యూయార్క్‌ నగరంలో చక్కర్లు కొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ బుధ‌వారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ క‌న్పించారు. ఈ సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

అదేంటంటే.. సరదాగా షాపింగ్‌కు వెళ్లిన ద్ర‌విడ్‌, రోహిత్ భారీ వ‌ర్షంలో చిక్కుకునిపోయారు. భారీ వ‌ర్షం కురుస్తుండంతో రోహిత్‌, ద్ర‌విడ్ ఇద్దరూ రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లో ఉండి పోయారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ అభిమాని రోహిత్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. ఫొటో కావాల‌ని అడిగాడు. దీనికి స్పందించిన హిట్ మ్యాన్ ‘నో ఫోటో, బ‌య‌ట భారీ వ‌ర్షం ప‌డుతోంది’ అంటూ రోహిత్ సమాధానం చెప్పుకొచ్చాడు. వెంట‌నే కారు తీసుకురావ‌లంటూ డ్రైవ‌ర్‌కు సైగ చేశాడు రోహిత్. వర్షం ప‌డుతుండ‌గానే రోహిత్, ద్ర‌విడ్ ఇద్ద‌రూ కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఫొటో కోసం ఎదురు చూసిన స‌ద‌రు అభిమానికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

నైసో కౌంటీలో వర్షాలు లీగ్ రౌండ్‌పై ప్రభావం చూపుతాయని క్రీడాభిమానులు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. మరోవైపు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై టీమ్‌ ఇండియా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసింది. డ్రాప్ ఇన్ పిచ్ అనేది ప్రాక్టీస్ కోసం మైదానంలో ఉంచిన కృత్రిమ పిచ్. ఈ పిచ్‌ను ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు బాగా ఉపయోగపడుతుంది. అయితే టోర్నీ పిచ్ ఎవరికి సహాయం చేస్తుందో చెప్పలేం. ఇందుకోసం రోహిత్ శర్మ స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నాడు. ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..