Video: టేబుల్ టాప్ లో ఉన్న బెంగళూరుపై సెహ్వాగ్ ట్రోల్! ఇప్పుడే ఫోటోలు తీసుకోండి అంటూ సెటైర్..
IPL 2025లో RCB అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ వారిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. "గరీబ్ జట్టు" అంటూ, టైటిల్ గెలుచుకోని ఫ్రాంచైజీలను ఎగతాళి చేశారు. RCB ఫైనల్‌కు మూడు సార్లు చేరుకున్నా, ఇప్పటివరకు టైటిల్ సాధించలేకపోయింది. సెహ్వాగ్ వ్యాఖ్యలు RCB అభిమానుల్లో ఆగ్రహం రేపినా, ప్రస్తుత ఫామ్‌ని నిలబెట్టుకుంటే టైటిల్ గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IPL 2025 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత ప్రదర్శనతో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అయితే, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ RCBపై విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, RCBని ‘గరీబ్’ (పేద) జట్టు అని సెహ్వాగ్ ఎగతాళి చేశాడు. RCB అగ్రస్థానంలో నిలిచిన నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “గరీబోన్ కో భీ తో రెహ్నే దే, ఫోటో లే థోడి దేర్. పటా నహీ కిత్నీ దేర్ గరీబ్ లోగ్ ఉపర్ రహేంగే” అని క్రిక్‌బజ్ చాట్‌లో మాట్లాడుతూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. (పేద జట్లు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండనివ్వండి, ఫోటోలు క్లిక్ చేసుకోనివ్వండి. వారు ఎంతకాలం అగ్రస్థానంలో ఉంటారో ఎవరికి తెలుసు?) అంటూ తనదైన వ్యంగ్యశైలిలో RCBని ట్రోల్ చేశాడు.
RCB ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేదు. 2008లో ప్రారంభమైన లీగ్‌లో 18 సీజన్లు గడిచినా, ఇప్పటికీ టైటిల్ నెగ్గలేకపోయిన ప్రీమియర్ ఫ్రాంచైజీగా ఇది నిలిచింది. సెహ్వాగ్ తన వ్యాఖ్యల్లో ఈ విషయాన్నే ప్రస్తావించాడు. “ఒక్క ట్రోఫీ కూడా గెలవని వారిని నేను ‘గరీబ్’ అంటున్నాను” అని స్పష్టంగా చెప్పాడు.
అయితే, “నేను డబ్బు గురించి మాట్లాడుతున్నానని అనుకోవద్దు. అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు సంపన్నమైనవే. ఒక్కో జట్టు ఏడాదికి 400-500 కోట్లు సంపాదిస్తోంది. నేను ఆర్థికంగా పేదవాళ్లను చెప్పడం లేదు, ఐపీఎల్ టైటిల్ గెలవలేని జట్లను ‘గరీబ్’ అని అంటున్నాను” అంటూ తన వ్యాఖ్యను వివరించాడు.
ప్రస్తుత IPL జట్లలో RCBతో పాటు పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కూడా ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే, LSG 2022లో మాత్రమే లీగ్‌లోకి ప్రవేశించింది, కాబట్టి వారి ప్రయాణం ఇంకా ప్రారంభదశలో ఉంది. కానీ, RCB, DC, PBKS మూడు ఫ్రాంచైజీలూ 16 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
సెహ్వాగ్ వ్యాఖ్యలపై RCB అభిమానులు భగ్గుమన్నారు. RCB ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తు టైటిల్ గెలవలేకపోయిందని వారు చెప్పారు. మరోవైపు, RCB ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులను కలిగిన జట్టుగా నిలిచిందని, ఫ్రాంచైజీ విలువ పరంగా టాప్-3లో ఉండటం గర్వించదగ్గ విషయమని నెటిజన్లు ట్వీట్లు చేశారు.
Virendra Sehwag trolled both Kohli and RCB at the same time😹😭🤣
— Gillfied⁷ (@Gill_Iss) March 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..