Vaibhav Suryavanshi : 10 సిక్సర్లు..19 బంతుల్లో హాఫ్ సెంచరీ..సౌతాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ రచ్చ మామూలుగా లేదు
సౌతాఫ్రికా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డ వైభవ్, మైదానం నలుమూలలా బంతుల్ని తరలించాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రిషబ్ పంత్ పేరిట ఉన్న భారత రికార్డును తిరగరాశాడు.

Vaibhav Suryavanshi : సౌతాఫ్రికా గడ్డపై భారత అండర్-19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్న ఈ కుర్రాడు, తాజాగా ప్రోటీస్ బౌలర్లను వణికించాడు. బెనోనీలో జరిగిన రెండో వన్డేలో కేవలం 24 బంతుల్లోనే 68 పరుగులు చేసి టీమిండియాకు భారీ ఆరంభాన్ని ఇచ్చాడు.
సౌతాఫ్రికా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డ వైభవ్, మైదానం నలుమూలలా బంతుల్ని తరలించాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రిషబ్ పంత్ పేరిట ఉన్న భారత రికార్డును తిరగరాశాడు. మొత్తం 24 బంతుల్లో 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంటే అతను చేసిన మొత్తం పరుగుల్లో 64 పరుగులు కేవలం బౌండరీల (10 సిక్సర్లు + 1 ఫోర్) ద్వారానే రావడం విశేషం.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా అండర్-19 జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. జేసన్ రౌల్స్ (114) సెంచరీతో పోరాడినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత స్పిన్నర్ కిషన్ సింగ్ 8.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో సౌతాఫ్రికా 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్ఎస్ అంబరీష్ రెండు వికెట్లు తీయగా, దీపేష్, కనిష్క్, ఖిలన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు సౌతాఫ్రికాలోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ జూనియర్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నాడు. వైభవ్ ఇచ్చిన మెరుపు ఆరంభంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. కేవలం 11 ఓవర్లలోనే టీమిండియా 100 పరుగుల మార్కును దాటేసిందంటే వైభవ్ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
