Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. చివరి మ్యాచ్ ఎప్పుడనేది తేల్చేసిన కింగ్..
Virat Kohli Future Plans 2027 World Cup Ambition: తాజాగా సైనా నెహ్వాల్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ, 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలనే తన కోరికను వెల్లడించాడు. తాను 2027లో ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నిస్తానని కోహ్లీ తెలిపాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న విరాట్, 2027 వన్డే ప్రపంచ కప్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం కోహ్లీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాడని అభిమానులు భావిస్తున్నారు.

Virat Kohli Targets 2027 World Cup: భారత జట్టు లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గురించి ఓ కీలక వార్త బయటకు వస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీ ఒక కార్యక్రమంలో సైనా నెహ్వాల్‌తో కలిసి కనిపించాడు. విరాట్ కోహ్లీ ఫూచర్ ప్లాన్స్ గురించి ఈ కార్యక్రమంలో ప్రశ్నించారు. దీనిపై విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం భారత అభిమానులందరినీ, విరాట్ అభిమానులను ఎంతో సంతోషపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2027 వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ ఆడతాడా?
ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నాకు తెలియదు, బహుశా నేను 2027 ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ విషయం చెప్పగానే, అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు. విరాట్ కోహ్లీ ప్రకటన తర్వాత, విరాట్ కోహ్లీ తదుపరి చూపు 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి గెలవడం అని స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన విరాట్ కోహ్లీ..
VIRAT KOHLI AT THE 2027 WORLD CUP.
– Kohli confirms World Cup as his next big step. 🐐🇮🇳pic.twitter.com/SJExtQIHtk
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025
భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే, కొద్ది రోజుల క్రితం, ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించిన భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ కూడా భాగస్వామ్యమయ్యాడు. అంటే, విరాట్ కోహ్లీ రెండవ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడన్నామాట. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 218 పరుగులు చేశాడు. ఇందులో పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీకి తదుపరి చూపు 2027 వన్డే ప్రపంచ కప్. వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. అక్కడ వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. దీని అర్థం విరాట్ కోహ్లీ ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలుస్తోంది. మరి విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ గెలుస్తాడో లేదో కూడాలి.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఒకే ఒక ప్రపంచ కప్‌ను గెలుచుకోగలిగాడు. 2011లో భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కళ్ళు 2027 వన్డే ప్రపంచ కప్ పై ఉన్నాయని తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..