AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్‌ ‘C’ అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే! అధ్యయనం వెల్లడి

ఆరోగ్యంగా ఉండటానికి ఎంత విటమిన్ సి అవసరం, దీని వల్ల చర్మం కొల్లాజెన్‌ను ఎంత బాగా ఉత్పత్తి చేస్తుంది అనే విషయాలపై క్రైస్ట్‌చర్చ్ ఓటౌటహిలోని ఒటాగో విశ్వవిద్యాలయంలోని చేసిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. చర్మం తనకు తాను చికిత్స చేసుకోవడానికి మాత్రమే కాకుండా, ఆహార విటమిన్ సికి కూడా కొలవగలదని పరిశోధనలు నిరూపించాయి..

విటమిన్‌ 'C' అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే! అధ్యయనం వెల్లడి
Eating More Vitamin C Can Physically Change Your Skin
Srilakshmi C
|

Updated on: Dec 29, 2025 | 5:48 AM

Share

జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ప్రచురితమైన తాజా పరిశోధనలో చర్మంలో విటమిన్ సి స్థాయిలు రక్తంలోని (ప్లాస్మా) స్థాయిలకు దగ్గరగా ప్రతిబింబించినట్లు సైంటిస్టులు కనుగొన్నారు. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం ద్వారా రక్తం, చర్మం సాంద్రతలు రెండూ పెరుగుతాయని వీరి అధ్యయనంలో తేలింది. విటమిన్ సి తినడం వల్ల చర్మ స్థాయిలు, మందం పెరుగుతుందట.

న్యూజిలాండ్, జర్మనీలోని అయోటెరోవాలోని 24 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఈ అధ్యయనం చేశారు. ప్రతిరోజూ రెండు విటమిన్ సి అధికంగా ఉండే సన్‌గోల్డ్ కివి పండ్లను తినడం ద్వారా వారి ప్లాస్మా విటమిన్ సి స్థాయిలను పరిశీలించారు. వీరి చర్మంలో విటమిన్ సి స్థాయి కూడా పెరిగినట్లు స్పష్టంగా  గుర్తించారు. ఈ పెరుగుదల మందమైన చర్మం (కొల్లాజెన్ ఉత్పత్తి), బయటి చర్మ పొర పునరుద్ధరణతో ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. పాథాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ విభాగంలోని మాటాయ్ హయోరా – సెంటర్ ఫర్ రెడాక్స్ బయాలజీ అండ్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్గరీట్ విస్సర్స్ ఈ అధ్యయనం ఫలితాలను వెల్లడించారు.

ప్రొఫెసర్ విస్సర్స్ ప్రకారం.. ఇతర అవయవాలతో పోలిస్తే రక్తంలోని విటమిన్ సి, చర్మపు విటమిన్ సి మధ్య సంబంధం ప్రత్యేకంగా నిలిచింది. ప్లాస్మా విటమిన్ సి స్థాయిలకు, చర్మంలో ఉన్న వాటికి మధ్య ఉన్న సంబంధం ఉంది. రక్తప్రవాహంలో ప్రసరించే విటమిన్ సి చర్మంలోని ప్రతి పొరను చేరుకుంటుందని, ఆరోగ్యకరమైన చర్మ పనితీరుకు దోహదపడుతుందని ఈ పరిశోధన బృందం కనుగొంది. రక్త ప్రసరణలో విటమిన్ సి చర్మంలోని అన్ని పొరలలోకి చొచ్చుకుపోతుందని, మెరుగైన చర్మ పనితీరుతో ముడిపడి ఉందని నిరూపించారు. చర్మ ఆరోగ్యం అంతర్గతంగా ప్రారంభమవుతుందనే ఆలోచనను ఈ పరిశోధనలు బలపరుస్తున్నాయని, పోషకాలు రక్తప్రవాహం ద్వారా సహజంగా రూపొందుతుందని ప్రొఫెసర్ విస్సర్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. అందుకే దీనిని సాధారణంగా చర్మ సంరక్షణ ఉత్పత్తులకు కలుపుతారు. అయితే విటమిన్ సి నీటిలో సులభంగా కరిగిపోతుంది. బాహ్య చర్మ అవరోధం ద్వారా అంత బాగా గ్రహించబడదు. చర్మం కణాలు రక్తం నుంచి విటమిన్ సిని గ్రహించడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని, బాహ్య ఎపిడెర్మల్ పొరలోకి తీసుకోవడం ప్రాధాన్యతగా కనిపిస్తుందని అధ్యయనం నిరూపించింది. సన్‌గోల్డ్ కివిఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ అధ్యయనం కోసం దీనిని ఎంపిక చేశారు. అయితే విటమిన్ సి అధికంగా ఉండే ఇతర ఆహారాలు ముఖ్యంగా సిట్రస్, బెర్రీలు, క్యాప్సికమ్‌, బ్రోకలీ వంటి తాజా పండ్లు, కూరగాయల నుంచి కూడా ఇలాంటి ప్రయోజనాలను పొందొచ్చు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని అన్ని భాగాలలోకి విటమిన్ సి సమర్థవంతంగా గ్రహించబడుతుందని ప్రొఫెసర్ విస్సర్స్ చెప్పారు.

శరీరం ఈ విటమిన్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయదు కాబట్టి, రక్తంలో విటమిన్ సి స్థాయిలను స్థిరంగా ఉంచడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు 250mg విటమిన్ సితో సరైన ప్లాస్మా స్థాయిలను నిర్వహించవచ్చని ప్రొఫెసర్ విస్సర్స్ పేర్కొన్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ప్రకృతి పంపే 5 సంకేతాలు
లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ప్రకృతి పంపే 5 సంకేతాలు