BCCI: బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా ఇదే.. కోహ్లీ, రోహిత్‌లపై క్లారిటీ.. ఇకపై ఎంత జీతం రానుందంటే?
Rohit and Kohli BCCI Contract Details: భారత పురుషుల క్రికెట్ జట్టు ఆటగాళ్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కొన్ని ప్రత్యేక విషయాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ముఖ్యమైనది టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టాప్ గ్రేడ్‌లోనే ఉంచుతారా లేదనే విషయంపై స్పష్టత రానుంది.

BCCI Annual Contract List: భారత పురుషుల క్రికెట్ జట్టు ఆటగాళ్ల కోసం బీసీసీఐ కొత్త వార్షిక కాంట్రాక్ట్ జాబితాను సిద్ధం చేసింది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి A+ గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్టును (రూ. 7 కోట్లు) అలాగే ఉంచేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లని, వారికి తగిన గౌరవం అందించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వాళ్లిద్దరూ మళ్లీ టాప్ గ్రేడ్‌లో స్థానం పొందారు.
4 వర్గాలుగా ఆటగాళ్లు..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటే, అందులో 4 రకాలు ఉన్నాయి. ఇందులో భారత ఆటగాళ్లను A+, A, B, C వర్గాలుగా విభజించనున్నారు. ఇందులో, A+ కేటగిరీ ఆటగాళ్లకు ఏటా రూ. 7 కోట్లు ఇస్తారు. అయితే A కేటగిరీ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు లభిస్తాయి. మిగిలిన బి, సి కేటగిరీ ఆటగాళ్లకు ఏటా రూ.3 నుంచి రూ.1 కోటి చొప్పున ఇవ్వబడుతుంది.
శ్రేయాస్, ఇషాన్‌లపై కీలక నిర్ణయం..
అదే సమయంలో బీసీసీఐతో విభేదాల తర్వాత శ్రేయాస్ అయ్యర్ 2023-24 సైకిల్‌లో సెంట్రల్ కాంట్రాక్టులోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇషాన్ కిషన్ గురించి మాట్లాడితే సెంట్రల్ కాంట్రాక్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా వేచి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..