KKR vs MI, IPL 2024: ముంబయి ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్స్ కు కోల్‌కతా

Kolkata Knight Riders vs Mumbai Indians: ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు ముంబయి ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. తద్వారా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా

KKR vs MI, IPL 2024: ముంబయి ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్స్ కు కోల్‌కతా
Kolkata Knight Riders vs Mumbai Indians
Follow us
Basha Shek

|

Updated on: May 12, 2024 | 12:44 AM

Kolkata Knight Riders vs Mumbai Indians: ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు ముంబయి ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. తద్వారా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (42), నితీశ్‌ రాణా (33), రస్సెల్‌ (24) రాణించారు. ముంబయి బౌలర్లలో పీయూష్‌ చావ్లా 2, బుమ్రా 2, తుషారా, అన్షుల్‌ కంబోజ్‌ చెరో వికెట్‌ తీశారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (40), తిలక్‌ వర్మ (32) మినహా ముంబయి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రోహిత్ (19), సూర్య కుమార్ యాదవ్ (11), హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (0), నేహాల్ వధేరా (3), నమన్ ధీర్ (17) ఇలా అందరూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఫలితంగా ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, రస్సెల్‌, హర్షిత్‌ రాణా తలా 2 వికెట్లు తీశారు. నరైన్‌ ఒక వికెట్ తీశాడు. కాగా KKRకి ఇది తొమ్మిదో విజయం. మొత్తం 18 పాయింట్లతో పట్టికలో  అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ సేన. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నిలిచింది.

ప్లే ఆఫ్స్ కు కోల్ కతా..

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI

 ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా.

కోల్‌కతా నైట్ రైడర్స్  ప్లేయింగ్ XI

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..