IND vs AUS: వన్డే సిరీస్‌లో గాయపడిన తెలుగబ్బాయ్.. కట్‌చేస్తే.. టీ20ఐ సిరీస్ నుంచి ఔట్..?
India vs Australia T20I Series, Nitish Kumar Reddy Injury: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా, ఇద్దరు భారత ఆటగాళ్లు గాయపడ్డారు. శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ సమయంలో గాయపడ్డాడు. ఒక యువ ఆటగాడు మ్యాచ్‌కు ముందే దూరమయ్యాడు.

India vs Australia T20 Series: ఆస్ట్రేలియాలో టీం ఇండియా పర్యటనలో తొలి దశ ముగిసింది. సిడ్నీలో జరిగిన చివరి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. టీమిండియా 1-2 తేడాతో ఓడిపోయింది. అయితే, క్రికెట్ యాక్షన్‌కు మాత్రం బ్రేకులు పడడం లేదు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌కు ముందు యువ భారత ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అతను తిరిగి క్రికెట్‌లోకి వస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం నితీష్ భారత జట్టులో భాగమయ్యాడు. అయితే, దీనికి ముందు, అతని ఫిట్‌నెస్ గురించి ఆందోళనలు ఉన్నాయి. నితీష్ వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాలో కూడా భాగం. మొదటి రెండు మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. అయితే, అతను మూడవ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. నితీష్ తొడ గాయంతో బాధపడుతున్నాడని, దాని కారణంగా అతనికి విశ్రాంతి ఇచ్చామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రకటనలో పేర్కొంది.
రెడ్డి T20 సిరీస్ ఆడగలడా?
అప్పటి నుంచి నితీష్ ఫిట్‌నెస్ గురించి BCCI లేదా టీం ఇండియా నుంచి ఎటువంటి కొత్త అప్‌డేట్ రాలేదు. అయితే, క్రిక్‌బజ్ నివేదిక ఇప్పుడు నితీష్ గురించి కొత్త సమాచారాన్ని అందించింది. నితీష్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని, కానీ టీ20 సిరీస్‌కు ఫిట్‌గా ఉంటారని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అతను ఫిట్‌గా ఉంటే, అది టీం ఇండియాకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఈ సిరీస్‌లో భాగం కాదు. అందువల్ల, నితీష్ ఉనికి జట్టుకు చాలా కీలకం.
అయ్యర్ కనీసం 3 వారాల పాటు ఆటకు దూరంగా..
శ్రేయాస్ అయ్యర్ విషయానికొస్తే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం సిడ్నీలో ఆసుపత్రిలో ఉన్నాడు. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అయ్యర్ గాయపడ్డాడు. అద్భుతమైన క్యాచ్ తీసుకుంటూ అతని పక్కటెముకలకు గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం అతని ఎడమ పక్కటెముకలకు పగులు ఏర్పడింది. దీని వలన అతను దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








