AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. ఈ అరవీర భయంకరుడి ఎన్నికకు కారణాలివే

దాదాపు 7 ఏళ్ల 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈసారి వేరే బాధ్యతలతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తున్నాడు. టీమిండియాను రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్..

Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. ఈ అరవీర భయంకరుడి ఎన్నికకు కారణాలివే
Gowtam Gambhir
Ravi Kiran
|

Updated on: Jul 10, 2024 | 10:00 AM

Share

దాదాపు 7 ఏళ్ల 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈసారి వేరే బాధ్యతలతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తున్నాడు. టీమిండియాను రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ ఇప్పుడు కోచ్‌గా భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. రాబోయే రెండేళ్లు టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని బీసీసీఐ అఫీషియల్‌గా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేయనున్నాడు. గౌతీ వరుసగా 3 సంవత్సరాలు ఐపీఎల్‌లో జట్లకు మెంటార్‌గా వ్యవహరించినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై మాత్రమే ఏ స్థాయిలోనూ కోచింగ్ అనుభవం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్‌ను కోచ్‌గా బీసీసీఐ కోరడం వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

డూ ఆర్ డై..

క్రీడ ఏదైనా.. ఎప్పుడూ కూడా ఆటగాడికి గెలవాలనే ఒకే ఒక్క లక్ష్యం ఉండాలి, ఓటమిని చూసి భయపడకూడదు. గెలవాలనే తపనతో బరిలోకి దిగితే.. విజయం కచ్చితంగా మనల్ని వరిస్తుంది. ఇక దీనికి నిదర్శనంగా నిలిచాడు గౌతమ్ గంభీర్. విజయం ఒక్కటే తన మనసులో ఉంటుంది. దాని కోసం తాను దేనికైనా సిద్ధమని గంభీర్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు. దీనికి గంభీర్ రికార్డు కూడా సాక్ష్యం. అతడు కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా.. మెంటార్‌గా మరోసారి గెలిపించాడు. ఇక అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 6 వన్డే మ్యాచ్‌లలోనూ విజయాలు దక్కాయి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఇవి కూడా చదవండి

బిగ్ మ్యాచ్.. బిగ్ డీల్..

2007, 2011 ప్రపంచకప్ ఫైనల్స్‌ను ఎవరు మర్చిపోగలరు? రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా తన ఖాతాలో కేవలం రెండు ప్రపంచకప్‌లను మాత్రమే పెట్టుకోగలిగింది. ఇక ఆ రెండు ఫైనల్స్‌లోనూ, గంభీర్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. దీని బట్టి చూస్తేనే గంభీర్‌కి బిగ్‌ మ్యాచ్‌లలో ఎంతటి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలో తెలుసు. గత 10 ఏళ్లలో టీమ్ ఇండియా చాలాసార్లు బిగ్ మ్యాచ్‌ల్లో విఫలమైంది. ఇక అటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మిగిలిన ఆటగాళ్లను ప్రోత్సహించి.. బిగ్ గేమ్స్‌లో గెలిచేలా చేశాడు. ఐపీఎల్ 2012 ఫైనల్.. 2014 ఫైనల్ ఇవే చెబుతున్నాయి.

నో హైరారిటీ..

గంభీర్ కెప్టెన్సీ, కోచింగ్ ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉంటుంది. అతడి దృష్టిలో జట్టులోని ఆటగాళ్లందరూ సమానమే. ఈ విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ ఆటగాళ్లతో తన మొదటి మీటింగ్‌లో, గంభీర్ జట్టులో జూనియర్-సీనియర్ లేదా అంతర్జాతీయ-దేశీయ తారతమ్యం ఉండదని, ప్రతి ఆటగాడు సమానంగా పరిగణించబడతాడని స్పష్టం చేశాడు. తద్వారా ప్రతి ప్లేయర్ జట్టు కోసం తన పూర్తి సామర్థ్యంతో ఆడగలడు. అతడు ఫాంలో లేకపోయినా.. ఇతరులకైనా కచ్చితంగా సహాయపడతాడు. అలాగే గంభీర్ ప్రతీ ఒక్కరికీ కావలసినన్ని అవకాశాలు ఇచ్చాడు.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మాన్‌స్టర్‌రా అక్కడ..

ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా గంభీర్ సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతాడు. రాబోయే కాలంలో టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గంభీర్ ఈ పనిని సమర్ధవంతంగా పూర్తి చేయగలడు.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..