Rahul Dravid: ప్రైజ్‌మనీ విషయంలో రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ ప్రశంసలు..

టీమిండియా మాజీ కోచ్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. టీ20 ప్రపంచ కప్ విజయంతో హెడ్ కోచ్ గా ఘనమైన వీడ్కోలు తీసుకున్న ఆయన ఆఖరి క్షణంలోనూ తన సింప్లిసిటీని, ఉదారతను ప్రూవ చేసుకున్నారు. ఇది తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, నెటిజన్లు దివాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Rahul Dravid: ప్రైజ్‌మనీ విషయంలో రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ ప్రశంసలు..
Rahul Dravid
Follow us

|

Updated on: Jul 10, 2024 | 12:07 PM

టీమిండియా మాజీ కోచ్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. టీ20 ప్రపంచ కప్ విజయంతో హెడ్ కోచ్ గా ఘనమైన వీడ్కోలు తీసుకున్న ఆయన ఆఖరి క్షణంలోనూ తన సింప్లిసిటీని, ఉదారతను ప్రూవ చేసుకున్నారు. ఇది తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, నెటిజన్లు దివాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఈ ప్రైజ్ మనీ క్రీడాకారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. ఇక్కడ టీం ఇండియా ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు లభించనున్నాయి. అలాగే ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు అందనుంది. అయితే సిబ్బంది విభాగంలో భాగమైన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు అదనపు ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఇతర సిబ్బంది మాదిరిగానే తనకు కూడా రూ.2.5 కోట్లు చాలన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడ్ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం.

కాగా రాహుల్ ద్రావిడ్‌తో కలిసి పనిచేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌కు ఒక్కొక్కరికి 2.5 కోట్లు అందనున్నాయి. ఈ అసమానతను తొలగించేందుకు రాహుల్ ద్రవిడ్ అదనపు ప్రైజ్ మనీని వద్దన్నారు. ఇతర సిబ్బంది లాగే రూ. 2.5 కోట్లు తీసుకుంటానని బీసీసీఐకి సమాచారం అందించాడు. రాహుల్ ద్రవిడ్ సమానత్వ సూత్రాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, 2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ప్రపంచకప్ గెలిచిన ఈ జట్టుకు బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇతర సిబ్బందికి 20 లక్షలు అందించారు. అయితే 50 లక్షల ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించిన రాహుల్ ద్రవిడ్.. తనతోపాటు కోచింగ్ స్టాఫ్ లోని ఒక్కో సభ్యుడికి రూ.25 లక్షలు అందేలా చూశారు. ఇప్పుడు మరోసారి రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించి సమానత్వానికి పెద్ద పీట వేశారు. మరి రాహుల్ ద్రవిడ్ నిర్ణయంపై బీసీసీఐ ఏమంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రైజ్ మనీ పంపిణీ ఇలా..

  • టీమ్ ఇండియాలోని 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 5 కోట్లు.
  • టీమిండియా రిజర్వ్‌ ప్లేయర్‌లుగా ఉన్న రింకూ సింగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు కోటి రూపాయల
  • చొప్పున లభించాయి.
  • భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 5 కోట్లు. (ఇప్పుడు రూ. 2.5 కోట్లు చేయాలని ద్రవిడ్ అభ్యర్థన).
  • టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌కు ఒక్కొక్కరికి 2.5 కోట్లు.
  • టీమ్ ఇండియా ఫిజియోథెరపిస్టులు కమలేష్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్‌లకు ఒక్కొక్కరికి 2 కోట్లు.
  • భారత త్రోడౌన్ స్పెషలిస్టులు రాఘవేంద్ర దివిగి, నువాన్ ఉడెనేకే మరియు దయానంద్ గరానీలకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు
  • టీమ్ ఇండియా మసాజ్ థెరపిస్టులు రాజీవ్ కుమార్, అరుణ్ కనడేలకు ఒక్కొక్కరికి 2 కోట్లు.
  • భారత జట్టు కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌కు 2 కోట్లు.
  • బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం